Jabardasth Naresh : జబర్దస్త్ కమెడియన్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి జబర్దస్త్ ద్వారా బాగానే పాపులర్ అయ్యాడు. అయితే నరేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను ఎన్నో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. మాకు ఫస్ట్ నుంచి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఎంతో కష్టపడి మా నాన్న చెత్త అమ్ముకునే షాప్ పెట్టాడు. పాత సీసాలు, ఇనుప సామాను, పేపర్లు, చెత్త కొనేవాళ్లం. అవి కొంత జమయ్యాక వాటిని అమ్ముకునేవాళ్లం. మా పరిస్థితి బాగా లేక అలాంటి బిజినెస్ చేశాం.
Read Also : ‘Raju Weds Rambayi’ : కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’- డే 2 కలెక్షన్స్
నేను కూడా ఆ షాపులోనే ఉండేవాడిని. ఆ షాపు నడుపుకుంటూనే సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నా. ఒకరోజు ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్ కు వెళితే అక్కడ ఒకతను జబర్దస్త్ కు తీసుకెళ్లాడు. అలా దాంట్లో అవకాశం వచ్చింది. తర్వాత అందులోనే సెటిల్ అయిపోయా. అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఇంకా అందులోనే ఉంటున్నా. సినిమాల్లో నటించాలని ఉంది. ఇప్పటికే కొన్ని మూవీల్లో చేశాను. కానీ పెద్ద పాత్రలు వస్తుంటే డేట్లు అడ్జస్ట్ కాక వద్దంటున్నా. నేను ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాక సినిమాల్లోకే వెళ్లిపోతాను అంటూ తెలిపాడు నరేశ్.
Read Also : Rajamouli : రాజమౌళి.. డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే