మల్లేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య నాగళ్ళ. డెబ్యూ మూవీతోనే అందరిని ఆకట్టుకున్న ఈ భామ వకీల్ సాబ్ చిత్రంలో పవన్ తో నటించి నిర్మాతల దృష్టిలో పడింది. ఇక వకీల్ సాబ్ తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న అనన్య ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఇక మరోపక్క తన అందచందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో నెట్టింట వైరల్ గా మారిన ఈ భామ కోలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో శశి కుమార్ సినిమాతో అనన్య తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది.
శశి కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘అంజల్’ చిత్ర ఫేం తంగం పా.శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌కేఎల్‌ఎస్ గెలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ బ్యానరులో ఇ.మోహన్ నిర్మించే ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు ముద్దుగుమ్మలు కోలీవుడ్ లో స్టార్లుగా మారిన సంగతి తెల్సిందే. వారిలా అనన్య కూడా కోలీవుడ్ లో హిట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.