మీకు చూయింగ్ గమ్ లేదా బబుల్ గమ్ నమలడమంటే ఇష్టమా? రోజూ అదే పనిగా నములుతున్నారా? మీరు టైంపాస్ కోసం చూయింగ్ నములుతున్నారా? లేదా ముఖానికి మంచిదనే కారణంతో నములుతున్నారా?.. ఇందుకు కారణం ఏదైనా చూయింగ్ గమ్ నమలడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇంతకీ లాభాలు, నష్టాల ఏంటో తెలుసుకుందాం..
చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే లాభాలు:
నోటి ఆరోగ్యం
షుగర్ లేని గమ్.. ముఖ్యంగా జిలిటాల్‌తో గమ్ నమలడం నోటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన గమ్ లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా.. ఈ లాలాజలం నోటిలోని హానికరమైన ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. పంటి ఎనామెల్‌ను మళ్లీ ఖనిజంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది కావిటీస్, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే.. చూయింగ్ గమ్ తినడం వలన నోటిలో సెలవా లెవెల్స్ ఇంక్రీజ్ అయి నోరు దుర్వాసన రాకుండా చేస్తుంది.
ఒత్తిడి
చూయింగ్ గమ్ మెదడులో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో.. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆమ్లత్వం
కొన్ని ఆరోగ్య నివేదికలు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ఉపశమనం చేయడంలో చూయింగ్ గమ్ కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చూయింగ్ గమ్ నోటి లోపల లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది. ఈ లాలాజలంలో బైకార్బోనేట్ కనిపిస్తుంది. ఇది సహజ యాసిడ్ న్యూట్రలైజర్. ఇది గొంతు, అన్నవాహికలో ఉండే కడుపు ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది.
చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే నష్టాలు:
దవడ నొప్పి
చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ (TMJ)పై ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల దవడ నొప్పి, తలనొప్పి, చెవి నొప్పి, నమలడం కష్టమవుతుంది.
దంతాలకు హాని
అనేక రకాల చక్కెర రహిత గమ్‌లకు ఆమ్ల రుచి జోడించబడుతుంది. ఇది ఎక్కువసేపు నమలడం వల్ల దంతాలకు హాని కలుగుతుంది. షుగర్ లెస్ చూయింగ్ గమ్‌లు మాత్రమే నమలండి. చూయింగ్ గమ్ తినడానికి సరైన సమయం.. భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు షుగర్ లేని గమ్ నమలాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాంటప్పుడు దవడ కండరాలపై పెద్దగా ప్రభావం చూపకుండా లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపించి దంతాలను శుభ్రం చేస్తుందని చెబుతున్నారు.