దీర్ఘకాల నొప్పి, ఎముకల సమస్యలు చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. చలి కాలంలో ఎండలో తక్కువగా గడుపుతాం. ఈ క్రమంలో.. శీతాకాలంలో విటమిన్ డి లోపం సర్వసాధారణం అవుతుంది. శరీరంలో విటమిన్ డి సరఫరా చేయడానికి సూర్యకాంతి చాలా అవసరం.
అందరూ ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు. అయితే.. తినే దానిలో రుచి, ఆరోగ్యకరంగా లేకపోతే తినడం కష్టంగా ఉంటుంది. అయితే.. కొత్తగా బ్రేక్ ఫాస్ట్ చేసేవారికి పోషకాలతో కూడిన ఓట్స్ సూపర్ ఫుడ్.
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.
కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం. కానీ అధికంగా ఉంటే చాలా హానికరం. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ధమనులు మూసుకుపోతాయి. ఈ క్రమంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ఆహారం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అరటిపండు అన్ని సీజన్లలో లభిస్తుంది. అరటిపండు తింటే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు అద్భుతంగా పని చేస్తుంది. చలికాలంలో అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తుంది. కాబట్టి.. రాత్రి పూట తినొద్దు.
జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఏంటాయి. జామపండు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. జామపండ్లు అందరూ తినలేరు. వీటిని తింటే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ కొన్ని పండ్లలో ఉండే విత్తనాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పండ్ల గింజల్లో సైనైడ్ అనే విష పదార్ధం తక్కువ మొత్తంలో ఉంటుంది. అది హానికరం కాకపోయినప్పటికీ, ఎక్కువ మొత్తంలో ఈ విత్తనాలను తీసుకోవద్దు.
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. అన్నంలో చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శీతాకాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికాలం అనేక సీజనల్ వ్యాధులను తెస్తుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ.. అనేక ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి.
ప్రతి అందరి ఇళ్ల కిచెన్‌లో బంగాళదుంపలు (ఆలుగడ్డ) ఖచ్చితంగా ఉంటాయి. బంగాళదుంప కర్రీ నుంచి మొదలు పెడితే.. సాంబారు, పులుసు ఇలా దీనిని వాడేస్తారు. బంగాళాదుంప కర్రీ అంటే కొంత మందికి ఇష్టముంటుంది.. కొంత మందికి ఉండదు. ఏదేమైనాప్పటికీ.. బంగాళదుంపలు ఆహార పదార్థాలలో ఒకటి. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. అయితే ఈ మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల మన ఆరోగ్యంపై చాలా ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా.