Kidney Stones: కిడ్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? కిడ్నిలో రాళ్లతో ఎటు తిరగలేకపోతున్నారా..? కిడ్నీలో స్టోన్ వచ్చిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే పొత్తి కడపులోంచి నొప్పి పొడుచుకొస్తుంది. అంతేకాకుండా యూరిన్ కు వెళ్తే.. మంటతో బాధపడుతారు. మహిళ కన్నా.. పురుషుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు. సుమారు 50శాతం మందికి ఏడేళ్లలోపే ఇవి రెండోసారి పుట్టుకు వచ్చే అవకాశముంది. నీళ్లు తక్కువ తాగడం, మాంసాహారం ఎక్కువగా తినడం, శరీరంలో విటమిన్ బి6, సి లోపం ఉన్నా, విటమిన్ డి అధికంగా ఉన్నప్పుడు, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి, కిడ్నీ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా సోకుతున్నా, ఆలస్యంగా భోజనం చేసినా.. కిడ్నీలో రాళ్లు వస్తాయి.
Read Also: Draupadi Murmu : హైదరాబాద్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
అయితే కిడ్నిలో రాళ్లు తొలగిపోవాలంటే నీరు ఎక్కువతాగాలి. పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. నీరు ఎక్కుగా తాగితే.. రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా అవుతాయి. దీంతో ఇవి మూత్రంతో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి. రోజుకు కనీసం.. 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది. అంతేకాకుండా మీరు తీసుకునే ఆహార పదార్థాలలో సరిపడా కాల్షియం తీసుకోండి. లేదంటే యూరిన్‌లో ఆక్జలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు వస్తాయి. కాల్షియం పేగులలో ఆక్సలేట్‌ను బంధిస్తుంది, దాన్ని ఎక్కువగా గ్రహించకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి.
Read Also: Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?
అంతేకాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే నాన్ వెజ్ తినడం తగ్గించాలి. మాంసం, చికెన్, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటి నాన్‌వెజ్ ఆహారం నుంచి వచ్చే ప్రొటీన్లు మూత్రంలో యూరిక్ యాసిడ్ మోతాలను పెంచుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. ప్రోటీన్‌ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్ స్థాయిలు కూడా పడిపోతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని.. నాన్‌వెజ్ తక్కువగా తీసుకోవడం మంచిది. మనం రోజుతినే వంటల్లో ఉప్పును తగ్గిస్తే మంచిది. సోడియం ఎక్కువగా తీసుకుంటే యరిన్‌లో క్యాల్షియం స్థాయిలు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.