రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. శనివారం హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకకు హాజరుకానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ నేపథ్యంలోనే.. రేపు ఉదయం 7గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుండి దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ముర్ము వెళ్లనున్నారు. అలాగే.. రేపు ఉదయం 11.15 గంటలకు ద్రౌపది ముర్ము ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే.. ఈ రోజు రాత్రి రాజ్‌భవన్‌లో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు.
Also Read : Upasana: పెళ్లి అయిన వెంటనే మేము వేరు కాపురం పెట్టాం.. కానీ, ఇప్పుడు
ఇదిలా ఉంటే .. అంతకు ముందు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ నవ్వుతూ పలకరించడం గమనార్హం. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా అనేక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి ఉంది. ఈక్రమంలో గవర్నర్ పాల్గొనే కార్యక్రమాలను ముఖ్యమంత్రి సాధ్యమైనంత వరకు గైర్హాజరవుతున్నారు. మరోవైపు గతంలో రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి వచ్చిన ద్రౌపది ముర్మును గతంలో సీఎం కేసీఆర్ స్వాగతం పలకలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు.
Also Read : Ambati Rambabu: పోలవరంలో జరుగుతున్న విషయాలను దాచాల్సిన అవసరం లేదు..