US President Elections: అమెరికా ఎన్నికల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ హాట్ కామెంట్స్ చేశారు. యూఎస్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. తమ దేశానికి కష్టమన్నారు. ట్రంప్ తో కలిసి పని చేయడం చాలా కష్టమన్నారు. కాగా, జేడీ వాన్స్ ఇటీవలే ఉక్రెయిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉక్రెయిన్ కు ఏం జరుగుతుందో తాము పట్టింకోమని చెప్పుకొచ్చారని.. లండన్‌లో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ భేటీలో జెలెన్ స్కీ వెల్లడించారు. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించారు.. ఉక్రెయిన్- రష్యా యుద్ధం గురించి పట్టించుకోకపోవచ్చు కానీ.. తాము యూఎస్ తో కలిసి పని చేస్తామ్నారు.
Read Also: Tamannaah Bhatia: తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు!
ఇక, ఉక్రెయిన్ కు తమ భాగస్వామ్యులు ఎఫ్-16 ఫైటర్ జెట్ లను అందిస్తామని చెప్పారని అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. కానీ, 18 నెలలు గడిచిన ఇప్పటికీ ఆ ఫైటర్ విమానాలు అందలేదన్నారు. తమపై రష్యా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు పైటర్ జెట్లు చాలా అవసరం.. ఉక్రెయిన్ విషయంలో బ్రిటన్ తీరు ఎప్పటికీ మారబోదని వెల్లడించారు. మరోవైపు, అమెరికా కాంగ్రెస్‌లోని వివాదాలతో ఉక్రెయిన్ కు చాలా కాలం పాటు అమెరికా సహాయం అందించలేదన్నారు. ఎట్టకేలకు తమకు ఆయుధాలను అందించిందని పేర్కొన్నారు. ఇకపోతే, జో బైడెన్ తో జరిగిన బిగ్ డిబేట్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్- రష్యా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజులోనే యుద్ధం ముగిస్తానని చెప్పుకొచ్చారని.. మాస్కో- ఉక్రెయిన్ లోకి సైన్యాన్ని పంపినప్పుడు తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదన్నారు.