Mid-Air Flight: అమెరికా న్యూజెర్సీలో ఓ వ్యక్తి అనుచిత ప్రవర్తన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడానికి కారణమైంది. అమెకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న 26 ఏళ్ల ఎరిక్ నికోలస్ గాప్కో ప్రవర్తన కారణంగా విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. జూలై 18న సీటెల్ నుంచి డల్లాస్ వెళ్తున్న విమానంలో, విమానంలో మహిళా సిబ్బంది తనతో సెక్స్ చేయాలని ప్రతిపాదించాడు. విమానం గాలిలో ఉండగానే అతను డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. చివరకు అతని వికృత ప్రవర్తన కారణంగా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
Read Also: Bunny Vasu: అల్లు అరవింద్ థియేటర్లు.. అసలు సీక్రెట్ చెప్పేసిన బన్నీవాసు
సదరు వ్యక్తి విమానం ప్రయాణం మధ్యలో తన చొక్కాను తీసేసి, ఫ్లైట్ అటెండెంట్‌ని సెక్స్ కోసం ప్రపోజ్ చేశాడు. ఇతర సిబ్బందిని తిడుతూ, కొట్టాలని ప్రయత్నించాడు. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఇతర ప్రయాణికులు గాప్కోని బలవంతంగా పట్టుకుని కాళ్లను కట్టేసి, విమాన సిబ్బందికి సాయం చేశారు. దీంతో విమానం సాల్ట్ లేక్ సిటీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను తన సీటులో ఉండటానికి విమాన సిబ్బంది సూచనలను పాటించడంలో విఫలమయ్యాడని, ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేశాడని అతడిపై అభియోగాలు మోపింది. కోర్టు ముందు అతను గురువారం హాజరయ్యాడు.