అణు ఒప్పందంపై ఇరాన్-అమెరికా మధ్య వార్ ముదురుతోంది. అణు ఒప్పందం చేసుకోవాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తుంటే.. ప్రసక్తేలేదంటూ ఇరాన్ తోసిపుచ్చుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోకపోతే బాంబు దాడి జరుగుతుందని ట్రంప్ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ద్వితీయ సుంకాలు విధిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇంతకముందు జరగని దాడులు జరుగుతాయని ట్రంప్ ఆదివారం హెచ్చరిక జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Home Minister Anita: క్యాన్సర్ పెషేంట్ తో విడియో కాల్ మాట్లాడిన హోం మంత్రి అనిత
కొత్త అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇప్పటికే ఇరాన్‌కు ట్రంప్ ఒక లేఖ రాశారు. అయితే ఈ ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తోసిపుచ్చారు. అలాగే అమెరికాతో ప్రత్యక్ష చర్చలను అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా తిరస్కరించారు. పరోక్ష చర్చల అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేదు.
ట్రంప్ తొలి పాలన హయాంలో టెహ్రాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోడానికి ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అందుకే చంద్రబాబుకి మద్దతు ఇచ్చాను.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దాదాపుగా 2018 నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది కాస్త ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత మరింత ముదిరింది. ఇరాన్ మద్దతు గల గ్రూపులపై దాడులు జరిగాయి. ప్రస్తుతం యెమెన్‌లో కూడా హౌతీ తిరుగుబాటుదారులపై కూడా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్‌కు రుచించడం లేదు. ఇక ట్రంప్ తాజా హెచ్చరికలతో మరోసారి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: DC vs SRH: సన్‌రైజర్స్ ఘోర పరాజయం.. ఢిల్లీ విక్టరీ