ఇటీవలే దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. సమావేశం తర్వాత 10 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.
ఇజ్రాయెల్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకానున్నారు. దక్షిణ కొరియా వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే చైనాపై 55 శాతం సుంకం విధించిన ట్రంప్.. తాజాగా మరో బాంబ్ పేల్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను హమాస్ ఉగ్రవాదులు లెక్కచేయడం లేదు. ఆయుధాలు విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. కానీ హమాస్ మాత్రం లెక్కచేయడం లేదు. తాజాగా 8 మందిని బహిరంగంగా కాల్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు 10 శాతం అదనంగా సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ట్రంప్.. దేశాలపై సుంకాలు విధించారు. ఈ చర్యను బ్రిక్స్ దేశాలు ఖండించాయి.
అణు ఒప్పందంపై ఇరాన్-అమెరికా మధ్య వార్ ముదురుతోంది. అణు ఒప్పందం చేసుకోవాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తుంటే.. ప్రసక్తేలేదంటూ ఇరాన్ తోసిపుచ్చుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.