Solar Storm: సూర్యుడి నుంచి వెలువడిన సౌరతుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని Spaceweather.com నివేదించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) భూవాతావరణంపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సూర్యుడిపై భారీ విస్పోటనాల తర్వాత ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏర్పడుతుంటాయి. ఇవి విశ్వంలో ప్రయాణిస్తుంటాయి.
ఒక కరోనల్ మాస్ ఎజెక్షన్ ఖచ్చితంగా భూవాతావరణాన్ని చేరుతుందని, మరో రెండు తప్పవచ్చని అంచనా స్పేస్ వెదర్ అంచనా వేసింది. ఆగస్టు 30న ‘కానియన్ ఆఫ్ ఫైర్’ మ్యాగ్నెటిక్ ఫిలమెంట్ విస్పోటనం తర్వాత సూర్యుడి నుంచి ఈ సౌరతుఫానులు బయలుదేరాయి.
అయితే వీటి ప్రభావం పెద్దగా ఉండనప్పటికీ.. భూ అయస్కాంత తుఫానులకు దారితీయనుంది. వీటి ప్రభావం కారణంగా అమెరికాలోని న్యూయార్క్, మిన్నెసోటా, వాషింగ్టన్, ఉత్తర యూఎస్ రాష్ట్రాల్లో అరోరాలు కనిపించవచ్చని నివేదిక పేర్కొంది. అంతకుమందు నానాకు చెందిన సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ (SOHO) సెప్టెంబర్ 1 న సూర్యుని నుండి ఒక ప్రకాశవంతమైన పసుపు మెరుపు వెలువడినట్లు నివేదిక తెలిపింది.
Read Also: COVID-19: హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ “పిరోల”.. మిగతా వాటితో పోలిస్తే ఎందుకు భిన్నమైంది..?
ఏంటీ ఈ సౌరతుఫానులు..? భూమిపై ప్రభావం:
సూర్యుడిపై భారీ పేలుళ్ల వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి శక్తి ఆవేశిత కణాల రూపంలో అంతరిక్షంలోకి వెళ్తుంది. సోలార్ సైకిల్ ప్రతీ 11 సంవత్సరాలకు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. అంటే ఉత్తర ధృవం దక్షిణంగా, దక్షిణ ఉత్తరంగా మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యుడిపై మాగ్నిటిక్ ఫీల్డ్ గందరగోళంగా ఉంటుంది. భారీ స్థాయిలో పేలుళ్లు ఏర్పడుతాయి. ప్రస్తుతం సూర్యుడు తన సౌరచక్రంలో తారాస్థాయికి చేరుకోవడంతో ఇలాంటివి సంభవిస్తున్నాయి.
అయితే భూమికి సహజంగా ఉండే మ్యాగ్నిటిక్ ఫీల్డ్ ఈ సౌరతుఫానులను అడ్డుకుంటుంది. దీని వల్ల మానవులకు, భూమిపై ఉండే జీవజాలానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. దీని వల్ల ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద అరోరాలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్బాల్లో రేడియో సిగ్నల్స్, శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్ కి ముప్పు కలిగించే ఆస్కారం కూడా ఉంటుంది.