COVID-19: హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ “పిరోల”.. మిగతా వాటితో పోలిస్తే ఎందుకు భిన్నమైంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID-19: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్-19 పీడ విరగడయ్యేలా కనిపించడం లేదు. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. BA.2.86 లేదా పిరోలా అనే కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది.. అమెరికా, యూకే, చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పిరోలా వేరియంట్ ఇజ్రాయిల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో కనుగొనబడింది.
2021లో బయటపడిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలో కేసుల పెరుగుదలతో పాటు భారీగా మరణాలకు కారణమైంది. అయితే ఇప్పుడు దీని సబ్ వేరియంట్ ‘పిరోలా’ మరెంత ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అని పరిశోధకులు భయపెడుతున్నారు. గతంలో ఓమిక్రాన్ శరీర వ్యాధినిరోధక శక్తిని, టీకా ప్రభావాన్ని తట్టుకుని ఇన్ఫెక్షన్లకు కారణమైంది.
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
Read Also: TS News: మేకను దొంగిలించాడని తలకిందులుగా వేలాడదీసిన యజమాని.. ఇదెక్కడి అరాచకం
అయితే ఇప్పుడు కొత్త BA.2.86(పిరోలా) వేరియంట్ గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండటం పరిశోధకుల భయాలకు కారణవుతోంది. ఈ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌పై ఏకంగా 30 ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్స్) ఉన్నాయి. ఇది మానవకణాల్లోకి సులువుగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తాయి. పిరోలా మల్టీ మ్యుటేషన్స్ మునపటి కరోనా వైరస్ వేరియంట్లతో పోలిస్తే దాని నిర్మాణంలో పూర్తి భిన్నంగా ఉందని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్లేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎరిక్ టోపోల్ రాయిటర్స్‌తో అన్నారు.
అయితే ప్రస్తుతం పిరోలా వ్యాప్తి పెద్దగా కనిపించడం లేదు, అయితే పిరోలా తీవ్రతకు సంబంధించి మునపటి వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ ఎంత తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందో చాలా త్వరగా తెలుసుకోవాలని యూఎస్ సెంట్రల్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) పేర్కొంది. ఇది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అనే వివరాలను సీడీసీ నిశితంగా గమనిస్తోంది.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!