Indian IT: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న అనూహ్యం నిర్ణయంతో భారతీయ ఐటీకి ముప్పు వాటిల్లనుంది. ఈ నిర్ణయంతో అనేక భారతీయ ఐటీ సంస్థలకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ జూలై 26న ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు మేర పెంచి అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీంతో ఫెడ్ రేటు 5.50 శాతం వద్ద అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ తాజా వడ్డీ రేట్లు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరింది. అంతేకాదు ద్రవ్యోల్బణంపై యుద్ధం సాగుతుందని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చైర్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికా ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందనే అందోళన మరింత ముదిరింది. భారతీయ ఐటీ నిపుణులను ఫెడ్ మరింత ఇబ్బంది పెట్టబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఫెడ్ రేట్ల పెంపు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. ఈ పెంపు చాలా విభాగాలకు ప్రతికూలంగా ఉంటుందని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని నిపుణుల అంచనా. వరుస వడ్డీ రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బ తీస్తుంది. మాంద్యంలోకి నెట్టవచ్చు. కనుక యుఎస్ ఆర్థిక మందగమనంతో అనేక భారతీయ ఐటీ సంస్థలకు దెబ్బేనని భావిస్తున్నారు.
Read also: MLA Seethakka: అక్కడి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్న సీతక్క
మింట్ నివేదిక ప్రకారం, అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా ఐటీ దిగ్గజాల ఫలితాలు బాగా దెబ్బ తిన్నాయి. ‘బిగ్ ఫోర్’ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీల రెవెన్యూ గైడెన్స్‌లో భారీ కోత విధించుకోవడం గమనార్హం. యుఎస్ మాంద్యం సుదీర్ఘ దశలోకి జారిపోతే, అది అసంభవంగా కనిపిస్తోంటే, ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్టాలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడ్ ఇకపై రేటు పెంపునకే మొగ్గు చూపుతున్న కారణంగా భారతీయ ఐటీ రంగ సంస్థలు మరింత నష్టపోతాయా? అంటే చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని మరికొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఈక్వినామిక్స్ రీసెర్చ్ ప్రైవేట్‌లో ఫౌండర్ & రీసెర్చ్ హెడ్ జి. చొక్కలింగం, యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు ముందే, భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఎగుమతి ఆదాయాలను డాలర్ రూపంలో పూర్ సింగిల్ డిజిట్‌లో పెంచుకోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. భారతదేశం ఐటి ఎగుమతుల, హైబేస్ హై గ్రోత్‌కు కొనసాగించడం అనేది నిర్మాణాత్మక సమస్య అన్నారు. ఐటీ ఎగుమతులు రేట్ల పెంపుదలకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 0-0.25 శాతం శ్రేణి నుండి దాదాపు 5 శాతానికి పెరిగే కాలంలో పెద్దగా తగ్గలేదు. కాబట్టి తదుపరి పెంపుదల ఏదైనా ఐటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. అయితే ఫెడ్ రేటు పెంపు రూపాయి మారకపు రేటును ప్రభావితం చేస్తుందని అదే పరిశ్రమ మార్జిన్‌లను కొనసాగించడానికి సహాయపడుతుందన్నారు.