CMF Phone 2: మరోమారు అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF.. కొత్త ఫోన్ లాంచ్కు డేట్ లాక్
- అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF..
- ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు ఫోన్, ఆడియో గాడ్జెట్ల లాంచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMF Phone 2: 2020లో ప్రారంభమైన నథింగ్ (Nothing) లండన్ ఆధారిత టెక్ కంపెనీ. టెక్నాలజీకి డిజైన్ పరంగా ఈ కంపెనీ కొత్త మార్పులు తీసుకురావడంలో బాగా ప్రసిద్ధి చెందింది. 2023లో ఈ Nothing తన సబ్‌బ్రాండ్ అయిన CMF ద్వారా మొదటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు, ఈ సబ్‌బ్రాండ్‌లో రెండో స్మార్ట్‌ఫోన్ అయిన CMF Phone 2 Pro ను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఇకపోతే ఈ CMF Phone 2 Pro టీజర్ పరంగా చూసినట్లయితే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో సెన్సార్లతో కూడిన ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరాల కోసం ఉండొచ్చని సమాచారం. ఈ కొత్త టీజర్‌లో ఫోన్‌కు టెక్స్చర్డ్, టాక్టైల్ ఫినిష్ ఉందని స్పష్టంగా చూపించారు. మెటాలిక్ భాగంలో స్క్రూ డిజైన్‌తో క్లోజ్ అప్ ఇమేజ్ ఒక స్టైలిష్, కస్టమైజబుల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది గత CMF Phone 1లో చూసినదానితో పోలిస్తే కాస్త మార్పులు కనపడుతున్నాయి.
Also Read
ఇక సమాచారం మేరకు ఇందులో ఫీచర్లు, సిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. అలాగే 6.3 అంగుళాల స్క్రీన్ ఉండొచ్చు. ఇది Phone (1) లోని 6.67 అంగుళాల స్క్రీన్ కన్నా చిన్నది. కస్టమైజబుల్ బ్యాక్ కవర్, ఇతర యాక్సెసరీల కోసం స్క్రూ ఫీచర్లు కొనసాగించనున్నారు. డిజైన్ పరంగా ఈ ఫోన్ నూతన అభిరుచి కలిగిన వినియోగదారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇకపోతే ఈ CMF Phone 2 Pro లాంచ్ సందర్భంగా Nothing కంపెనీ మూడు కొత్త ఆడియో ఉత్పత్తులను కూడా విడుదల చేయనుంది.
గత ఏడాది మోడల్‌కు అప్డేటెడ్ వెర్షన్ గా CMF Buds 2, CMF Buds 2a, Buds 2 Plus కొత్త మోడల్స్ విడుదల కానున్నాయి. ఇవి CMF Buds Pro 2 కన్నా తక్కువ ధరలో లభించవచ్చు. ఈ ఫోన్‌ను, ఆడియో గాడ్జెట్లను కంపెనీ ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు లాంచ్ చేయనుంది. మొత్తంగా కొత్తగా రాబోయే ఈ CMF Phone 2 Pro ఫీచర్లు, డిజైన్, మల్టీ కస్టమైజేషన్‌తో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక మిగతా పూర్తి వివరాలు అధికారిక లాంచ్ రోజు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!