Amazon Mega Electronics Days: టెక్నాలజీని బాగా ఉపయోగించుకొనే వారికి ఓ గొప్ప సమయం వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 13వ తేదీ వరకు అమెజాన్ లో ఉన్న పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు వంటి ఎన్నో గ్యాడ్జెట్లపై ప్రత్యేక డీల్స్ ఈ సందర్భంగా లభ్యమవుతున్నాయి. మరి ఈ సేల్ లో భాగంగా ఏ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఒకసారి చూద్దామా..
Read Also: Allu Arjun – Trivikram: అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా: నోళ్లు మూయించే యత్నం !
ల్యాప్‌టాప్ లపై 45% వరకు:
ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్‌లో HP, Lenovo, Dell, ASUS, Acer లాంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి ల్యాప్‌టాప్‌లు 45% వరకు తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ లేదా AMD ప్రాసెసర్, SSD స్టోరేజ్, 8GB RAM, బ్యాక్లిట్ కీబోర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.
ట్యాబ్లెట్లపై 55% వరకు:
స్కూల్, ఆఫీస్ పని లేదా వినోదం కోసం ట్యాబ్లెట్ కొనాలని భావిస్తున్నట్లైతే.. అమెజాన్ ఇప్పుడు Samsung, Apple, Lenovo, Xiaomi లాంటి బ్రాండ్స్ నుండి ట్యాబ్లెట్లపై 55% వరకు భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఈ ట్యాబ్లెట్లు HD డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, టెక్నికల్ సపోర్ట్, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ఉన్నాయి.
స్మార్ట్‌వాచ్‌లపై 70% వరకు:
ఈ మధ్యకాలంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం ఎక్కువగానే జరుగుతుంది. ఇక ఈ సేల్ లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని రాయితీలు లభిస్తున్నాయి. అదికూడా 70% వరకు తగ్గింపు లభిస్తుంది. boAt, Noise, Samsung, Apple వంటి బ్రాండ్స్ నుండి స్టైలిష్ లోక్, ఫీచర్-రిచ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. హార్ట్‌రేట్ మానిటరింగ్, SpO2, స్లీప్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి.
Read Also: YS Jagan Helicopter Damaged: రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్ డ్యామేజ్..!
హెడ్‌ఫోన్‌లపై 80% వరకు:
మీ మ్యూజిక్ అనుభవాన్ని మరో లెవెల్‌కు తీసుక వెళ్లేందుకు boAt, JBL, Sony వంటి బ్రాండ్స్ నుండి వైర్లెస్ ఇయర్‌బడ్స్, నాయిస్ క్యాన్సలేషన్‌తో కూడిన హెడ్‌ఫోన్‌లు దాదాపు 80% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.
PC యాక్సెసరీస్‌పై 60% వరకు:
మీ కంప్యూటర్ సెటప్‌ను అప్‌గ్రేడ్ కోసం వేచి ఉన్నట్లయితే.. అమెజాన్ ఇప్పుడు మౌస్‌లు, కీబోర్డ్లు, వెబ్‌క్యామ్‌లు, మానిటర్లు, స్టోరేజ్ డ్రైవ్స్‌పై 60% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. Logitech, HP, Dell, WD లాంటి పేరుగాంచిన బ్రాండ్స్ నుండి ఎంపిక చేసుకోవచ్చు.
స్పీకర్లు, సౌండ్బార్‌లపై 70% వరకు:
మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చుకునేందుకు సువర్ణ అవకాశం ఇది. boAt, JBL, Sony లాంటి బ్రాండ్స్ నుండి స్పీకర్లు, సౌండ్ బార్ లు ఇప్పుడు 70% తగ్గింపుతో లభిస్తున్నాయి. డాల్బీ ఆడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
కెమెరాలపై 55% వరకు:
ఫోటోగ్రఫీ అంటే మీకు ఇష్టం ఉన్నవాళ్లు ఈ డీల్స్ ను మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. Canon, Sony, GoPro, Fujifilm లాంటి బ్రాండ్స్ నుండి DSLR, మిరర్‌లెస్, యాక్షన్ కెమెరాలు, వ్లాగింగ్ కిట్లు వాటిపై ఏకంగా 55% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. 4K వీడియో, హై మెగా పిక్సెల్ సెన్సార్లు, Wi-Fi కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ అమెజాన్ మేగా ఎలక్ట్రానిక్స్ డేస్ ఆఫర్లు అన్ని రకాల వినియోగదారుల కోసం ఎంతగానో ఉపయోగపడనున్నాయి.