Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద తన అభిమానులను నిరాశపరిచింది. సినిమాలో ఆయన ట్రిపుల్ రోల్ పోషించినా, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టారు కల్యాణ్ రామ్. ఈ క్రమంలోనే తాను నటిస్తున్న ‘డెవిల్’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ చిత్రంగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేసిందట చిత్ర యూనిట్. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించారని సమాచారం.
Read Also: Bala Krishna: బాలయ్య దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి
దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. పోస్టర్ లో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నారు. ఒక చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని ఉన్నారు. మరో చేతిలో గన్‌తో షూట్ చేస్తున్నారు. ఆయన యాక్షన్ మోడ్‌లోని ఇన్‌టెన్స్ లుక్ చూస్తుంటే డెవిల్ వంటి మరో వైవిధ్యమైన కథనంతో అలరించబోతున్నారని తెలుస్తుంది.
Read Also: Bhola Shankar: మెగాభిమానులకు చిరంజీవి ఉగాది కానుక.. నెక్ట్స్ మూవీ అప్ డేట్
చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు. మా బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో, ఇప్పటి వరకు టచ్ చేయని ఓ కొత్త పాయింట్‌ను చూపిస్తూ పీరియాడిక్ మూవీగా డెవిల్ సినిమాను రూపొందిస్తున్నాం. వెర్సటైల్ మూవీస్ చేస్తూ వస్తోన్న కళ్యాణ్ రామ్ మరోసారి డెవిల్ సినిమాతో సర్‌ప్రైజ్ ఇస్తారు. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. నవీన్ మేడారంగారు సినిమాను సూపర్బ్‌గా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ అందిస్తాం’’ అన్నారు.