పాకిస్థాన్‌లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బలూచిస్థాన్ వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబును పేల్చారు. రైల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. బలూచిస్థాన్ తిరుగుబాటుదాలు, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ దాడికి బాధ్యత వహించారు.
రాజస్థాన్‌లోని సికార్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కల్వర్టును బస్సు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కోల్‌కతాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు ఒక్కసారిగా కూలిపోయింది.
టెక్సాస్లో ఓ ముష్కరుడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. శనివారం సాయంత్రం టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయలయ్యాయి. జునెటీన్త్ పండుగ సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ముష్కరుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారని CNN నివేదించింది. గాయపడిన వారందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడులో (Tamil Nadu) ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో (firecracker blast) భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. పలు తీవ్రంగా గాయపడ్డారు.