Kachiguda Railway Track : హైదరాబాద్ నగరంలో గురువారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. కాచిగూడ రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి ఓ కారు నిలిపివేయడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రైల్వే మార్గంలో కారు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కాచిగూడ పోలీసులు, రైల్వే సెక్యూరిటీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రైల్వే ట్రాక్‌పై నిలిచిన కారును అక్కడి నుంచి తొలగించేందుకు…
పాకిస్థాన్‌లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బలూచిస్థాన్ వెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబును పేల్చారు. రైల్లో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. బలూచిస్థాన్ తిరుగుబాటుదాలు, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ దాడికి బాధ్యత వహించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో బారీ వరదలు సంభవిస్తున్నాయి. కాలనీల్లోని రోడ్లు ఏరులైపారుతున్నాయి. ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డిలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. హావేలిఘనపూర్ మండలంలో వర్షం వణికించింది. ధూప్ సింగ్ తండా, తిమ్మాయిపల్లి, నాగపూర్, వాడి గ్రామాలను వరద ముంచెత్తింది. ఇండ్లలో నీళ్లు చేరి గ్రామాల్లో రోడ్లపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది వరద.…
రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అయితే కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా ట్రాక్ దాటుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ట్రాక్ మధ్యలో చిక్కుకుంది. ఇదే సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ దూసుకొచ్చింది. అయితే లోకో పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. ఆకస్మాత్తుగా ట్రైన్ ఆగగానే…
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి లుమ్‌డింగ్‌కు వెళ్తోంది.
Raebareli: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు తప్పించేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే నిలిపివేశాడు.
Iron Rods In Rail Track: పంజాబ్‌లోని భటిండాలో ఈరోజు (సోమవారం) పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు కనిపించడంతో గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
Suicide Attempt: బీహార్ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే…
Viral : ఆవు రైల్వే ట్రాక్ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఆవు ట్రాక్‌ను దాటాలని చూస్తుంది, అయితే అదే సమయంలో రైలు వస్తుంది.