చైనా ప్రతి దేశంలో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి అపవాదును తొలగించుకునేందుకు, ఆ విషయాలను పక్కదోవ పట్టించేందుకు చైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉన్నదేశాలతో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగన్, తైవాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీంగా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా తన ఆదీనంలోకి తీసుకుంటానని అంటోంది. టిబెట్ విషయంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించి ఆ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నది.
Read: ఆ డ్రెస్ లో దేవకన్యలా మిల్కీ బ్యూటీ !!
సామ్రాజ్యవాద, విస్తరణ ధోరణితో ఉన్న చైనా తైవాన్ విషయంలో అనుకున్న విధంగా ప్లాన్‌ను అమలుచేసి ఆక్రమించుకుంటే, ప్రపంచంలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయో అవకాశం ఉంటుంది. మొదటి నుంచి అమెరికా తైవాన్‌కు మద్దతూ ఇస్తూ వస్తున్నది. అమెరికాతో పాటు అసియాలోని అనేక దేశాలు కూడా తైవాన్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఒకవేళ చైనా తైవాన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చైనా వ్యతిరేక దేశాలన్నికూడా ఒక్కటయ్యే అవకాశం లేకపోలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు.