ప్రపంచంలో అమెరికా కలిగి ఉన్న అత్యుత్తమ సంబంధాల్లో భారతదేశం ఒకటి అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ నియమితులయ్యారు.
China: ఇంటి అద్దెను ఆదా చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా కంపెనీ టాయిలెట్‌ని మకాంగా మార్చుకుంది. చైనాకు చెందిన 18 ఏళ్ల యువతి యాంగ్, తన పనిచేస్తున్న ఫర్నీచర్ దుకాణంలోని టాయిలెట్‌ని నివాసంగా చేసుకుంది. దీనికి నెలకు 5 యువాన్‌లు (రూ. 545) అద్దె చెల్లిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నెలకు దాదాపుగా రూ. 34,570 సంపాదిస్తుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడానికి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది.
భారతదేశం గతంలో వ్యవసాయంపై ఆధారపడింది. ప్రపంచీకరణ తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా మారిపోయింది. వ్యవసాయంపై ప్రజలు ఆధారపడటం తగ్గిపోయింది. శ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించింది. అయితే.. ఉపాధిపై ఆధారపడటం పెరిగింది. దేశంలో పరిశ్రమల వృద్ధి కారణంగా ఉద్యోగావకాశాలు కూడా పెద్దఎత్తున సృష్టించబడ్డాయి.
భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌లు ముందున్నాయి. అయితే డిజిటల్ ఎగుమతుల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ కంటే అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మాత్రమే ముందున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం.. భారతదేశం 2023లో 257 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ వస్తువులను ఎగుమతి చేస్తుంది. భారతదేశ డిజిటల్ ఎగుమతులు 2022 సంవత్సరంలో 17 శాతం పెరిగాయి.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు.
భారతదేశం పొరుగున ఉన్న మాల్దీవుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక సంస్కరణల ప్రయత్నాల్లో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చు తగ్గింపును ప్రకటించారు. మహ్మద్ ముయిజ్జూ తన జీతంలో 50 శాతం తీసుకోబోరని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, మాల్దీవులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించబడుతుంది.
PM Modi: ప్రపంచ దేశాలు మొత్తం కరోనా, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బంది పడుతున్న వేళ కూడా మన దేశంలో ‘భారత్ శతాబ్ది’ గురించి ఆలోచిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం అన్నారు.
ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవుల సంఖ్య అత్యధికంగా 47 శాతం ఉన్నారు. ఆ తర్వాత.. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. వలస వచ్చిన వారిలో వారి జనాభా 29 శాతం ఉంది. వలస వెళ్లే వారిలో హిందువులు మూడవ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింల కంటే కేవలం 5 శాతం మంది హిందువులు మాత్రమే వలస వెళ్లి స్థిరపడ్డారు. అలాగే.. బౌద్ధులు 4 శాతంతో నాల్గవ స్థానంలో ఉండగా.. యూదులు 1 శాతం…