తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరం వేళ ప్రతి ఒక్కరి ఆలోచన తమకు ఈసారైన అన్ని రంగాల్లో కలిసి వస్తుందా? లేదా అని ఆందోళన చెందుతుంటారు. తమ రాశిఫలాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండగా మరికొన్ని రాశులవారికి కాస్త ఇబ్బందులు కలిగేలా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మేషరాశి వారి విషయానికి వస్తే.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది.
Also Read:SRH vs DC: మరోమారు ఆకాశమే హద్దుగా చెలరేగనున్నారా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఎస్‌ఆర్‌హెచ్
మేశ రాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. బృహస్పతి తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండడం చేత వీరికి ఆర్థికంగా అంతగా అనుకూలించదు. మేష రాశివారికి సంతాన విషయంలో కొంత అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ, వృత్తి, వ్యాపారం, కెరీర్, ఉద్యోగం, ఆరోగ్యం, వాహన రంగాల్లో అద్భుతంగా ముందుకు దూసుకువెళ్లడానికి అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తు్న్నారు పండితులు. చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. కానీ, వాటిని అధిగమిస్తే మంచి ఫలితాలను అందుకుంటారని సూచిస్తున్నారు.
Also Read:Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
ఈ రాశివారికి వ్యతిరేకమైన గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి పరిహారం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మంగళ, బుధ, గురు, శుక్ర ఈ నాలుగు రోజులలో మధ్యాహ్న భోజనంలో తప్పకుండా ఇంగువను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంగువను తినలేము అనుకునేవారు కాస్త ఇంగువను రోజులో ఎక్కువసార్లు వాసన చూడడానికి ప్రయత్నం చేస్తే వారిలో సరికొత్త ఆలోచనలు వచ్చి శుభకరమైన ఫలితాలను పొందుతారని చెబుతున్నారు.