అతడికి ఏడాది క్రితం వివాహమైంది. కట్నంకోసంమే చేసుకున్నాడో, తల్లిదండ్రుల బలవంతం వలన చేసుకున్నాడో తెలియదు కానీ, తనకి నచ్చని అమ్మాయి మెడలో తాళికట్టాడు. పెళ్లి అయినా దగ్గరనుంచి ఆమెను చిత్ర హింసలకు గురిచేయడం మొదలు పెట్టాడు.. అందంగా లేవని, అసహ్యంగా ఉన్నవాని చిత్రహింసలు పెట్టేవాడు. చివరకు ఆమె మీద కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. ఏ భర్త చేయని నీచానికి ఒడిగట్టాడు. భార్యను ఎలాగోలా వదిలించుకోవాలని ఆమెను స్నేహితులకు అమ్మేసి చేతులు దులుపుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కోటకు సమీపంలోని బుండి ప్రాంతానికి చెందిన ఒక యువతిని విజయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన రాకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు పెద్దలు..పెళ్లి తర్వాత భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు రాకేష్.. భార్య అందంగా లేదని తిడుతూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇక ఇటీవల ఆమెపై కోపంతో ఆమెను తన స్నేహితులకు అమ్మేశాడు. వారు ఆమెను దెవ్లీ ప్రాంతానికి తీసుకెళ్లి ఓ ఇంట్లో ఉంచి, కొన్ని రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.