దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం సరికొత్త జోష్ కనిపించింది. 10 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా భారీ ర్యాలీగా సూచీలు దూసుకెళ్లాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 73, 730 దగ్గర ముగియగా.. నిఫ్టీ 254 పాయింట్లు లాభపడి 22, 337 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 31 పైసలు లాభపడి 86.96 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Jana Reddy: కులగణనలో నా పాత్ర లేదు.. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు..
ఇక నిఫ్టీలో అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన లాభాలను ఆర్జించగా… బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. పీఎస్‌యూ, టెలికాం, మెటల్, పవర్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2.5 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: Singer Kalpana: జరిగింది ఇదే.. సింగర్ కల్పన కేసులో పోలీసుల వివరణ..