కొద్దిరోజులుగా విశ్వరూపం సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. వెనిజులా సంక్షోభంతో ఈ వారం ప్రారంభం నుంచి ధరలు తాండవం ఆడుతున్నాయి. కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు కొనుగోలుదారులు. మొత్తానికి ఈరోజు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 270 తగ్గగా.. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్
తులం గోల్డ్‌పై రూ.270 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 తగ్గగా రూ.1,26,500 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.210 తగ్గగా రూ.1,03,500 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!
మొత్తానికి సిల్వర్ ధర శాంతించింది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,52, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,72,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,52, 000 దగ్గర అమ్ముడవుతోంది.