బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ప్రస్తుతం ఆషాడమాసం కావడంతో వినియోగదారులు బంగారం కొనవచ్చా? లేదా?అనే సందేహంలో ఉన్నారు. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో కూడా ఇదే విధమైన ధరలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటే తప్ప దేశీయ ధరలు ఇలానే ఉండొచ్చని బులియన్ ట్రేడర్లు అంటున్నారు. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్‌లో రూ.46,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది. బంగారం మాదిరిగానే దేశీయంగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం.
పుత్తడి మాదిరిగానే వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,800గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.57,200 వద్ద కొనసాగుతోంది. పసిడి రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. అందువల్ల మన దగ్గర బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు తగ్గాయి. అందువల్ల ఇప్పుడు కొనొచ్చా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పసిడి రేటు పడిపోవడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు గోల్డ్ జువెలరీ కొనుగోలు చేయొచ్చు. బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56 వేలకు పైనే ఉంది. అందువల్ల అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు గోల్డ్ రేటు భారీగానే తగ్గిందని చెప్పుకోవాలి.