భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కియా ఈవీ6 కారును విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ధర మార్చి 2025లో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది దక్షిణ కొరియా తయారీదారు కియాకు చెందిన నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇటీవల లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. 2025 మోడల్‌ను అప్డెట్ చేశారు. కియా EV6 డిజైన్, సాంకేతికత, పనితీరు గురించి తెలుసుకుందాం..
READ MORE: Arvind Kejriwal: ‘‘మోడీ అనుమతితోనే మేనిఫెస్టో ప్రకటించారా..?’’ బీజేపీపై కేజ్రీవాల్ సెటైర్లు..
అయితే.. ఈ కారుకు ముందు వైపు హెడ్‌లైట్‌లు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లు అమర్చారు. EV6 ఫేస్‌లిఫ్ట్ 19-అంగుళాల, 20-అంగుళాల పరిమాణాలలో నలుపు-తెలుపు అల్లాయ్ వీల్స్ అందించారు. వెనుక భాగంలో టెయిల్లాంప్ లాగా ఓ ఎల్‌ఈడీ లైట్‌ను ఉంచారు. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డ్రైవర్స్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉన్నాయి. Apple CarPlay, Android Autoతో వైర్‌లెస్ కనెక్టివిటీని కలిగి ఉంది. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ రీడిజైన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. కారు కీని ఉపయోగించకుండానే డ్రైవర్ దీన్ని స్టార్ట్ చేయవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్‌తో పాటు నావిగేషన్ కోసం OTA అప్‌డేట్ చేశారు. కారు లోపలి భాగంలో డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, 12-అంగుళాల హెడ్స్-అప్-డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి.
READ MORE: Amazon Republic Day sale 2025: టూవీలర్స్ పై ఆఫర్ల వర్షం.. ఇప్పుడు కొంటే వేల్లో లాభం!
2025 కియా EV6లో 84 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీంతో ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. 494 కి.మీ రేంజ్ ఇస్తుంది. కొత్త బ్యాటరీ 350 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు. స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌లు 225 bhp, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇంకా ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, మోటారు శబ్దాన్ని తగ్గించడానికి, మరింత భద్రత కోసం, శరీరంపై ప్రభావం చూపకుండా.. ఫ్రీక్వెన్సీ-సెలెక్టివ్ డంపర్‌లను మెరుగుపరిచినట్లు కంపెనీ పేర్కొంది.