దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
దక్షిణకొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి సమాచారం అందించింది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కియా ఈవీ6 కారును విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ధర మార్చి 2025లో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది దక్షిణ కొరియా తయారీదారు కియాకు చెందిన నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇటీవల లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. 2025 మోడల్‌ను అప్డెట్ చేశారు. కియా EV6 డిజైన్, సాంకేతికత, పనితీరు గురించి తెలుసుకుందాం..
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 (EV6) 1,100 కంటే ఎక్కువ యూనిట్లను రీకాల్ చేసింది. ఈ వాహనాలు మార్చి 3, 2022 మరియు ఏప్రిల్ 14, 2023 మధ్య తయారు చేశారు.
Kia EV3: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా తన EV3 కారును రివీల్ చేసింది. కియా నుంచి ఇప్పటికే EV6, EV9 మరియు EV5 ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంది. నాలుగో మోడల్‌గా EV3 రాబోతోంది. ఇటీవల ‘2024 వరల్డ్ కాప్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్న EV9 డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది EV3ని రూపొందించనట్లు కియా చెబుతోంది. ఈ కారు డైమెన్షన్స్‌ని పరిశీలిస్తే 4,300mm పొడవు, 1,850mm వెడల్పు మరియు 1,560mm…
కొరియన్ కార్ల తయారీ సంస్థ ‘ కియా ’ ఇండియాలో అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. ఎన్నడూ లేని విధంగా ఏడాది తొలి అర్థభాగంతో పాటు జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను నమోదు చేసిందని కియా ఇండియా ప్రకటించింది. జూన్ నెలలో ఏకంగా 24,024 యూనిట్ల కార్లను విక్రయించింది. 2021లో ఇదే నెలలో 15,015 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపుగా 10 వేల యూనిట్లను అదనంగా విక్రయించింది. దాదాపు 60 శాతం గ్రోత్ నమోదు చేసింది. కియా…
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఎలక్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్‌తో…