Bharat Mobility Global Expo 2025 Hero MotoCorp: న్యూడిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆటో మొబైల్ ప్రపంచం పునరుద్ధరణకు దారితీసే అనేక కొత్త వాహనాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త టూ వీలర్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో Xoom 125, Xoom 160 స్కూటర్లతో పాటు Xtream 250R, Xpulse 210 బైకులను కూడా విడుదల…
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కియా ఈవీ6 కారును విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ధర మార్చి 2025లో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది దక్షిణ కొరియా తయారీదారు కియాకు చెందిన నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇటీవల లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. 2025 మోడల్‌ను అప్డెట్ చేశారు. కియా EV6 డిజైన్, సాంకేతికత, పనితీరు గురించి తెలుసుకుందాం..
హోండా తన పాపులర్ డియో స్కూటర్ యొక్క 2025 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,930గా నిర్ణయించింది. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రూ. 1500 ఎక్కువ. 2025 వెర్షన్‌లో జపాన్ కంపెనీ దానిలో పలు మార్పులు చేసింది. OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను అందించింది.
టాటా మోటార్స్ ఇటీవల పలు కార్లను కొత్త ఫీచర్లు, వేరియంట్‌లతో అప్‌డేట్ చేసింది. టియాగో, టిగోర్ తర్వాత కంపెనీ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నెక్సాన్ ఇంజన్ మెకానిజంలో ఎటువంటి మార్పు లేదు. కానీ దీనికి కొన్ని కొత్త ఫీచర్లు, వేరియంట్‌లు జోడించారు. కొత్త టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
దక్షిణ కొరియా కార్ల తయారీదారు హ్యుందాయ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీని పరిచయం చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారికంగా పరిచయం చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (భారత్ మండపం)లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రపంచానికి విడుదల చేసింది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. దీని పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
హీరో మోటోకార్ప్ తన రెండు అద్భుతమైన స్కూటర్‌లు Xoom 160, Xoom 125లను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లు వాటి ఆకర్శణీయమైన డిజైన్‌తో పాటు శక్తి వంతమైన ఫీచర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. Xoom 125 ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్), Xoom 160 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ధారించింది. ఈ రెండు స్కూటర్లు హీరో ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం. వాటి…
మీరు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీ కోసమే. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 నాక్ కాబోతోంది. ఇది జనవరి 17 నుంచి 22 మధ్య భారత్ లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీల మాదిరిగానే, టాటా మోటార్స్ కూడా అనేక లైనప్‌లను ఆవిష్కరించబోతోంది. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో కంపెనీ టాటా సియెర్రా ఈవీని ఆవిష్కరించబోతోంది. దీని డిజైన్ ప్రత్యేకంగా ఉండబోతోంది. స్లిమ్…