భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త వాహనాలు కనిపించాయి. భారతీయ ఆటో కంపెనీ A-THON కూడా అశ్వ పేరుతో ఒక అద్భుతమైన కారును పరిచయం చేసింది. ఈ కారు రెండు వేరియంట్లలో వస్తుంది. A-THON Ashva - 4X4, A-THON Ashva 6X4. ఈ కార్లు వ్యవసాయం కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో Xoom 125 స్కూటర్‌ని విడుదల చేసింది. కంపెనీ మొత్తం రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇందులో VX, ZX ఉన్నాయి. రోజువారీ ప్రయాణీకులకు ఈ స్కూటర్ అత్యుత్తమ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. కొత్త Hero Xoom 125 ప్రారంభ ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉందో చూద్దాం..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలను తమ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తున్నాయి. హ్యుందాయ్ కంపెనీ సరికొత్త కారును ఆవిష్కరించింది. ఫ్లెక్స్ ఫ్యుయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా మోడల్ ను తీసుకువచ్చింది. హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారుతో ఎకో ఫ్రెండ్లీ జర్నీని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ హ్యూందాయ్ క్రెటా మోడల్ కారు 1.0 టర్బో…
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, ఎక్ట్రిక్, సీఎన్జీతో నడిచే కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు సోలార్ తో నడిచే కారు కూడా వచ్చేసింది. దేశంలోనే మొట్ట మొదటి కారు ఇది. ఆటో ఎక్స్ పోలో వేవ్ మొబిలిటీ సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది. పట్టణాల్లో షార్ట్ రైడ్ కోసం ఈ కారు…
భారత్ మొబిలిటి గ్లోబల్ ఎక్స్ పో కొనసాగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్ని తమ కొత్త మోడల్స్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. కార్లు, ఎలక్ట్రిక్ కార్లు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆటో ఎక్స్ పోలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త కార్లను ఆవిష్కరించింది. ఇందులో ఈవీ కారు కూడా ఉంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్ తో టాటా కార్లు అదరగొడుతున్నాయి. టాటా ఆవిష్కరించిన కార్లలో సియెర్రా, హారియర్ ఈవీ, టాటా అవిన్యా X…
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కియా ఈవీ6 కారును విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ధర మార్చి 2025లో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది దక్షిణ కొరియా తయారీదారు కియాకు చెందిన నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇటీవల లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. 2025 మోడల్‌ను అప్డెట్ చేశారు. కియా EV6 డిజైన్, సాంకేతికత, పనితీరు గురించి తెలుసుకుందాం..
మహీంద్రాకు చెందిన బీఈ6 గురించి తెలిసిందే. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP)లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.97 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌తో బీఈ6 ఇప్పుడు భారతీయ రోడ్లపై రెండవ సురక్షితమైన ఎస్‌యూవీగా అవతరించింది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన 3 కొత్త ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. ఇందులో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇ-యాక్సెస్ కూడా ఉంది. సుజుకీకి చెందిన ప్రముఖ స్కూటర్ యాక్సెస్ ను కంపెనీ నవీకరించి విడుదల చేసింది. కంపెనీ Gixxer SF 250ని కూడా విడుదల చేసింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం...
మారుతీ సుజుకి ఇండియా ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది. కంపెనీ ఈరోజు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. కంపెనీ మార్చిలో పూర్తి ఫ్లాష్‌ని లాంచ్ చేస్తుంది. భారతీయ మార్కెట్లో ప్రవేశించనున్న విటారా ఈవీ.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ కారులో మీరు ప్రత్యేక ఫీచర్ల గురించి…
PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు.