దక్షిణకొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి సమాచారం అందించింది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కియా ఈవీ6 కారును విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ధర మార్చి 2025లో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది దక్షిణ కొరియా తయారీదారు కియాకు చెందిన నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇటీవల లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు. 2025 మోడల్‌ను అప్డెట్ చేశారు. కియా EV6 డిజైన్, సాంకేతికత, పనితీరు గురించి తెలుసుకుందాం..
న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇటీవల ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే కియా సిరోస్ ఎస్‌యూవీ.. కియా మోటార్స్ జనవరి 3 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో సరికొత్త సిరోస్ ఎస్‌యూవీ బుకింగ్‌ను ప్రారంభించనుంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి దీని బుకింగ్ ప్రారంభం కానుంది.
Kia Carnival 2024 Launched in India: నాల్గవ తరం కార్నివాల్‌ను కియా ఇండియా లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. మూడోతరం కార్నివాల్ (35.50 లక్షలు) కంటే ఇది రెట్టింపు ధర. ఈ కారు సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది. ఇది 7-సీటర్‌గా లిమోసిన్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. నాల్గవ తరం కార్నివాల్…
Hyundai-Kia: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV)ల వాడకం పెరుగుతోంది. టూవీలర్స్, కార్‌లతో ఈవీలను కొనుగోలు చేయడానికి భారత వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ కార్లను రూపొందిస్తున్నాయి.
Record car sales: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్‌వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
సాధారణంగా ఇయర్ ఎండింగ్‌లో కార్లపై భారీ ఆఫర్లు ఉంటాయి.. ఆ తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత వివిధ సంస్థలు.. వాటి కార్ల ధరలను పెంచడం చూస్తూనే ఉన్నాం.. అంటే, డిసెంబర్‌లో కొంటే.. సాధారణ ధరకంటే తక్కువకే కారు తీసుకునే అవకాశం ఉండగా.. క్యాలెండర్ మారిందంటే.. జేబుకు చిల్ల పడడం ఖాయం అన్నమాట.. తాజా, వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను పెంచనున్నట్టు చెబుతోంది.. జనవరి 23వ తేదీ నుంచి కార్ల ధరలను…
ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతపురంలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. ఇందులో నాలుగు లక్షల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుదల చేయగా, లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని 91 దేశాలకు కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు…