Champion: రోషన్–నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఫన్నీ చిట్‌చాట్.. ‘ఛాంపియన్’ ప్రమోషన్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champion: టాలీవుడ్ యంగ్ హీరో మేకా రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, మూవీ టీమ్ తాజాగా ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రోషన్ మేకా, భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. నితీష్, రోషన్‌కు సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలుపగా.. రోషన్ కూడా నితీష్ క్రికెట్ కెరీర్‌కు అభినందనలు తెలిపాడు. “నీ మూవీకి కాంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్” అని నితీష్ చెప్పగా.. సినిమా డిసెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్స్, 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ అవుతుందని రోషన్ తెలిపాడు. దీనితో నితీష్ సినిమాను కచ్చితంగా చూస్తానన్నాడు.
Also Read
ICC Rankings: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలిసారిగా వరల్డ్ నెం.1 కైవసం..!
రియల్ లైఫ్ ఛాంపియన్ ఎవరు?
సంభాషణలో భాగంగా నితీష్ అడిగిన “ఛాంపియన్ అంటే ఎవరు?” అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. దీనికి రోషన్, “నా రియల్ లైఫ్‌లో నా నాన్న, అమ్మనే నా ఛాంపియన్స్” అని సమాధానం చెప్పాడు. దీనికి నితీష్ కూడా ఏకీభవిస్తూ.. “నా డాడ్ నా కోసం చాలా త్యాగాలు చేశారు” అని స్పందించాడు.
ఫేవరెట్ క్రికెటర్, ఐపీఎల్ టీమ్..
ఆ తర్వాత నితీష్ రోషన్ ను అడిగిన “నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు?” అనే ప్రశ్నకు ఎంఎస్ ధోని అని సమాధానమిచ్చాడు. దీనికి నితీష్ కూడా మేము కూడా “స్టాండ్స్ నుంచి చూస్తున్నప్పటికీ, అతను ఫీల్డ్ సెట్ చేసే విధానం, మైండ్‌తో ఆటను నడిపే తీరు నాకు చాలా ఇష్టం” అని వివరించాడు. అలాగే ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి.. హైదరాబాద్ నుంచి వచ్చిన నితీష్ రోషన్ ను ఏ టీమ్‌కు సపోర్ట్ చేస్తావని అడగగా.. “ధోని కారణంగా…” అంటూ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 42.74 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు..
ఫేవరెట్ యాక్టర్లు, హీరోయిన్లు..
సినిమా టాపిక్‌కు మళ్లిన ఈ చిట్‌చాట్‌లో నితీష్ తన ఫేవరెట్ యాక్టర్‌గా మహేష్ బాబు పేరును వెల్లడించాడు. రోషన్ మాత్రం తనకు నచ్చిన హీరో పేరు చెప్పలేనని.. “అలా చెప్పకూడదు అంటూ సరదాగా నవ్వాడు. ఇక ఇష్టమైన హీరోయిన్ల విషయానికి వస్తూ.. రోషన్ తనకు సమంత ఇస్తామని తెలుపగా, నితీష్ మాత్రం కాజల్ అగర్వాల్ ఫేవరెట్స్‌గా చెప్పుకొచ్చారు. ఇక చివర్లో రోషన్, “నా టీమ్‌ను నీ మూవీకి తీసుకువెళ్తాను” అంటూ నితీష్ చెప్పగా.. దానికి రోషన్ “థ్యాంక్ యూ సో మచ్” అంటూ స్పందించాడు.
Fun conversation between actor Roshan and cricketer NKR #Champion pic.twitter.com/kzvUIIpbQ4
— idlebrain jeevi (@idlebrainjeevi) December 23, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!