2024 Lok Sabha elections: 2024 లోకసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలను ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) కొత్తగా 8.92 లక్షల కొత్త వీవీపాట్ మెషీన్‌లకు ఆర్డర్ చేసింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVMలు) తప్పుగా ఉన్నాయనే ఆందోళనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. వీవీపాట్ స్టాక్ ను సమీక్షించడం ద్వారా వాడుకలో లేని ఎం2 వీవీపాట్ యంత్రాలను రిటైర్ చేయడంతో పాటు కొత్తవాటిని ఉత్పత్తి చేయడం, అందుబాటులో ఉన్న ఎం2ఎం3 యంత్రాలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీల్లో, ఓటర్లలో ఉన్న అనుమానాలను తొలగించేందుకు గత ఎన్నికల్లో ఈసీ వీవీపాట్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 17.4 లక్షల వీవీపాట్లను మోహరించారు. ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా వీటిని ఉపయోగించారు. ఎన్నికల అనంతరం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) మరియు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)లతో పాటు సాంకేతిక నిపుణుల కమిటీ సమగ్ర విశ్లేషణను నిర్వహించి ఎం3 వీవీపాట్ ల పనితీరును మెరుగుపరచడానికి మరిన్ని చర్యలు అవసరం అని నిర్థారించింది.
రీప్లేస్‌మెంట్ రేటును తగ్గించడానికి M2 మోడల్ మెషీన్‌ను నిలిపివేయాలని, ఎం2ఎ3 వీవీపాట్లను ఎం3 మోడల్ కి అప్‌గ్రేడ్ చేయాలని కూడా నిర్ణయించారు. కొత్తగా ఈసీ చేత ఆర్డర్ చేయబడిన వీవీపాట్ లను బీఈఎల్, ఈసీఐఎల్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని వివిధ రాష్ట్రాలకు పంపించనున్నారు.