PM Modi: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నంబర్ వన్ గా ఉందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వేంట్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొబైల్ డేటా అతి చౌకగా లభించే దేశాల్లో భారత్ో ఒకటని ఆయన అన్నారు.
Poonch terror attack: గురువారం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ ఉగ్రదాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడిలో మొత్తం 7 గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. రెండు ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు పాల్గొన్నట్లు తేలింది.
Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన ఆ సంస్థ పరువు తీసింది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విమానయాన సంస్థలకు జరిమానా విధించింది. ఇదిలా ఉంటే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఓ పైలెట్ తన మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. దీనిపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది.
Sudan Crisis: సైన్యం, పారామిలిటీరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశం సూడాన్ అట్టుడుకుతోంది. ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు, ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖార్టూమ్ నగరంలో రెండు దళాల పోరు తారాస్థాయికి చేరింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో 350 మందికి పైగా…
Firing at Delhi's Saket court: ఢిల్లీ సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటన జరగగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Covid-19: భారతదేశంలో ప్రతీరోజూ 10 వేలకు అటూఇటూగా కోవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తంగా 19 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 9 మంది ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుంది. అయితే నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య ఈ రోజు గణనీయంగా తగ్గింది. నిన్న ఒక్కరోజే 12,591 కేసులు నమోదు అయ్యాయి.
70-Year-Old Forced To Walk Barefoot To Collect Pension From Bank: వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఆసరా. ప్రభుత్వం ఇచ్చే రెండు మూడు వేలను నెలంతా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. అదే సమయంలో పింఛన్ సరైన సమయంలో రాకుంటే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో కన్నవాళ్లు వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో ఈ పింఛనే ఆధారంగా ఉంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్ కోసం పడుతున్న పాట్లు పలువురితో కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Poonch Attack: భారతదేశంపై పాకిస్తాన్ తన కుట్రలను అమలు చేయడం ఆపడం లేదు. తినడానికి తిండి లేకున్నా కూడా పాకిస్తాన్ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. భారత్ దినదినం అభివృద్ధి చెందుతుంటే, ఉగ్రవాద దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ మాత్రం రోజురోజుకు ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాతాళంలోకి కూరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా కూడా భారత్ అంటే అదే ద్వేషం, అదే అక్కసు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన, అక్కడ శాంతిభద్రతల పరిస్థితులు, పెట్టుబడులు రావడం పాకిస్తాన్ కు…
Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నిందితులంతా నిర్దోషులే అని కీలక తీర్పు వెలువరించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పును ప్రకటించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ భజరంగ్ దళ్ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కోర్టు చెప్పిన తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కవి రహత్ ఇండోరి కవితను ఉటంకిస్తూ.. అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు.
Poonch Attack: జమ్మూకాశ్మీర పూంచ్ జిల్లాలో గురువారం భీంజెర్ గలి నుంచి సాంగియోట్ కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు గ్రెనెడ్స్ తో దాడి చేశారు. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన ఐదుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. సైన్యంతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.