JioCinema: జియో సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంగా మార్చేందుకు రిలయన్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ గా ఉన్న జియో సినిమా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో పెయిడ్ సబ్‌స్ట్రిప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగిసిన వెంటనే జియో సినిమా ఇకపై ఫ్రీగా వీక్షించే అవకాశం ఉండదని చెప్పకనే చెప్పింది. కొత్త కంటెంట్ ను యాడ్ చేయడంతో పాటు యూజర్లను ఆకర్షించేలా ప్లాన్స్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయింది.
Ram Navami violence: రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది.
PM Modi: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్ఠాయిలో ప్రచారాన్ని పటిష్టం చేయాలని, మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాన్ని ఇలా నడపలేమని ప్రధాని పునరుద్ఘాటించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్కూల్ లోని విద్యార్థులను బందీలుగా చేసుకునేందుకు ఓ వ్యక్తి తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ ఘటన మాల్డా జిల్లాలోని ముచియా చంద్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
Operation Kaveri: కల్లోలిత ఆఫ్రికా దేశం సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో భారత ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. తాజాగా తొలి విడత భారతీయులతో ఢిల్లీకి విమానం చేరుకుంది. సూడాన్ సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఆ దేశంలో సంక్షోభానికి దారితీశాయి.
Male infertility: ప్రస్తుత కాలంలో జీవనశైలి పురుషుల్లో సంతానలేమికి కారణం అవుతోంది. పురుషుల్లో వంధ్యత్వానికి వీర్యకణాలు దెబ్బతినడం కారణమని తెలుస్తోంది. అయితే వీర్యకణాల దెబ్బతినడానికి ప్రమాద కారకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లోని సెమ్మెల్వీస్ యూనివర్సిటీ పరిశోధకులు స్పెర్మ్ పదార్థాన్ని దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన కారకాలను తెలుసుకున్నారు. కాలుష్యం, స్మోకింగ్, వేరికోసెల్, డయాబెటిస్, టెస్టికల్ ట్యూమర్, వయస్సు వంటివి స్మెర్మ నాణ్యతపై ప్రభావం చూపిస్తున్నట్లుగా తేలింది.
Nursing Colleges: ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలతో కలిపి రూ. 1,570 కోట్లతో 157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో తక్కువ ధరకు నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించడంతో పాటు నర్సింగ్ నిపుణుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Pakistan fears India may conduct another surgical strike: జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పూంచ్ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన 5 మంది సిబ్బంది వీరమరణం పొందారు.
Pakistan: ఆర్థిక సమస్యలు, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ పై యుద్ధం చేయలేదన్న విషయం అందరికి తెలిసు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా అంగీకరించినట్లు పాకిస్తాన్ సుప్రసిద్ధ జర్నలిస్టు హమీద్ మీర్ చెప్పారు. పాకిస్తాన్ వద్ద ఆర్మీ వాహనాలు ఉన్నాయి కానీ అందులో పోసే ఇంధనం లేదని,
Yogi Adityanath: కర్ణాటక ఎన్నికలకు మరో కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టార్ క్యాంపెనర్లను ప్రచారంలోకి దించాయి. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్యాలో ఆయన ఎన్నికల ర్యాలీలో బుధవారం పాల్గొన్నారు.