India Was World's 4th Largest Defence Spender In 2022: ప్రపంచంలో దేశ రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ చుట్టూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో భారత్ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది. 2021తో పోలిస్తే భారత్ రక్షణ వ్యయం 6 శాతం పెరిగినట్లు స్వీడన్ దేశానికి చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక తెలిపింది.
Russia: ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత పలువురు అధికారులు, పుతిన్ కు సన్నిహితులు, ఆయన్ను వ్యతిరేకించిన వారు వరసగా అనుమానాస్పద మరణాలకు గురువుతున్నారు. తాజాగా పుతిన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు ఒకే రోజు మరణించడం చర్చనీయాంశం అయింది. అధికార యునైటెడ్ రష్యా పార్టీకి చెందిన స్టేట్ డూమా డిప్యూటీలుగా పనిచేస్తున్న ఇద్దరు రష్యన్ అధికారులు ఆదివారం మరణించారని న్యూస్ వీక్ నివేదించింది.
Cyber Fraud: మహారాష్ట్ర థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన టికెట్ క్యాన్సలేషన్ తర్వాత రీఫండ్ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. అయితే ఆ తరువాత దాదాపుగా రూ. 5 లక్షలు సైబర్ మోసంలో కోల్పోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితుడు, అతని స్నేహితుడు కెన్యాలోని మొసాంబా నగారాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే దీని కోసం కెన్యా రాజధాని నైరోబీ నుంచి రిటర్న్ టి
Court Issues Warrant Against 23 Terrorists: జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ నుంచి బహిష్కరణకు గురైన 23 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), పాకిస్తాన్ దేశాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలో 13 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ అయ్యాయి. కిష్త్వార్కు చెందిన 36 మంది వ్యక్తులు కొంతకాలంగా ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్కు వెళ్లారు. ఆ తర్వాత, వారిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని…
Woman In Hijab Harassed: మహారాష్ట్ర ఔరంగాబాద్ దుర్మార్గమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. సదరు అమ్మాయి హిందూ యువకుడితో తిరుగుతోందని అనుమానించిన వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ గా మారడంతో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఔరంగాబాద్ నగరంలోని బేగంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మకై గేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Uttar Pradesh: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. ఏకంగా తనను కిడ్నాప్ చేసి, హత్య చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. ఈ వీడియోను తన కుటుంబీకులకు పంపి టెన్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి తన కాళ్లను, చేతులను కట్టేసుకుని, నాలుకను బయటకు తెరిచి, ముఖంగాపై రక్తపు మరకలతో ప్రమాదంలో ఉన్నట్లు వీడియోను క్రియేట్ చేశాడు.
Kanpur woman elopes with boyfriend’s father: రోజురోజుకు ప్రేమకు అర్థం మారిపోతుంది. అసలు ప్రేమంటే ఏమిటో తెలియడం లేదు. అలాంటి విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు చూశాం.
11 Cops Killed In Blast By Maoists In Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మావోలు పోలీసులు లక్ష్యంగా భారీ పేలుడుకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో అరాన్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో మొత్తం 11 మంది పోలీసులు చనిపోయినట్లు సమాచారం.
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధిష్టించింది. ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఈరోజు ఢిల్లీ మేయర్గా తిరిగి ఎన్నికయ్యారు