Karnataka Elections: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కొంపముంచబోతున్నాయా..? అంటే బీజేపీ ఆ విధంగానే సింపతి సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. గత అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. తాజాగా ఈ రోజు కలబురిగిలో జరిగిన ఓ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విషపు పాము లాంటి వాడని, బీజేపీ పార్టీ కూడా అటువంటిదే అని వ్యాఖ్యానించాడు. అతను విషపు పామా..? కదా..? అని తెలుసుకోవాలంటే తాకి చూడాలని, అలా…
Chrisann Pereira: డ్రగ్స్ కేసులో షార్జా జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా తన జైలు అనుభవాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆమె యూఏఈ జైలులో శిక్ష అనుభవిస్తోంది. జైలులో తన జుట్టును డిటర్జెంట్ సబ్బుతో కడుకున్నానని, టాయిలెట్ వాటర్ తో కాఫీ తయారు చేసిన విషయాలని ఓ లేఖలో వెల్లడించింది. 26 రోజుల జైలు శిక్ష అనంతరం బుధవారం సాయంత్రం విడుదలైన క్రిసాన్ త్వరలోనే ఇండియా చేరుకోనున్నారు.
Rajnath Singh holds talks with Chinese defence minister: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు.
Jiah Khan Suicide Case: బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉన్న ఈ ఆత్మహత్య కేసు 2013లో సంచలనం రేపింది. జూన్ 3, 2013లో ముంబైలోని తన ఇంట్లో నటి జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
Walnut: కొన్ని సార్లు సోషల్ మీడియాలో శాశ్వతంగా నిలిచిపోయే చాటింగ్స్ జరుగుతుంటాయి. కొన్ని సార్లు కొంతమంది ఇచ్చిన రిప్లైలను ఎప్పటికీ మరిచిపోలేము. అలాంటిదే ‘వాల్నట్’ సీఈఓ రోషన్ పటేల్ కు ఓ మహిళ నుంచి ఎదురైంది. రెండేళ్ల క్రితం జరిగిన సంభాషణలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 2021లో తన స్టార్టప్ లో పనిచేసేందుకు అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను నియమించుకోవాలని రోషన్ పటేల్ భావించాడు. ఆ సమయంలో అతని స్టార్టప్ కోసం ఫండింగ్ ప్రారంభం…
India at UN: ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ముఖ్యంగా ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వ హోదా, వీటో అధికారం ఉండటంపై గళమెత్తుతోంది. కేవలం ఈ ఐదు దేశాలు మాత్రమే ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహించలేవని చెబుతోంది. భారత్ వాదనకు ఇతర ప్రపంచదేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. భద్రతా మండలిని సంస్కరించాలని పలుమార్లు భారత్ యూఎన్ ను కోరింది.
Thailand: థాయ్ లాండ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 12 మంది స్నేహితులను సైనైడ్ ఇచ్చి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తులంతా 33 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారేనని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు డబ్బులే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఈ రోజుతో కస్టడీ ముగియడంతో మనీస్ సిసోడియాను సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోదీ ‘‘విషపు పాము’’అని, ఇది నిజమా కాదా..? అని తేలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని,
ఇదిలా ఉంటే కొందరు మాత్రం తమకు మక్కువ ఉన్న రంగంలోకి వెళ్తున్నారు. అలాంటి కోవలోకే వస్తారు తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు వెంకటసామి విఘ్నేష్. ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలో ఉద్యోగం నెలకు రూ. 40,000 జీతం అయినా ఇవన్నీ వదిలేసి తనకు మక్కువ ఉన్న వ్యవసాయ రంగంలోకి వెళ్లేందుకు ఉద్యోగం మానేశాడు. తల్లిదండ్రులు మొదట్లో భయపడ్డా కూడా ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ.. వారి భయాలను దూరం చేశాడు.