Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ప్రసంగం చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోబడతాయని, దీని ద్వారా భారత రాజ్యాంగంలోని మౌళిక లక్షణం అయిన లౌకికవాదాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Spider Nesting Inside Ear: చైనాలో విచిత్ర సంఘటన జరిగింది. చెవినొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. అంతా పరీక్షించిన తర్వాత షాక్ తినడం డాక్టర్ల వంతైంది. సదరు మహిళ చెవిలో ఓ సాలీడు ఏకంగా గూడు కట్టుకుని ఓ కుటుంబాన్ని పెంచుకుంటోంది. మహిళ టిన్నిటస్( రింగింగ్ సౌండ్ వినడం) చెవి నొప్పితో డాక్టర్లను సంప్రదించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది.
Poonch Terror Attack: గత వారం జమ్మూ కాశ్మీర్ పూంచ్ లో సైనికులు వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. గ్రేనేడ్లను విసిరి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన కుట్ర బయటపడుతోంది.
Noida: సోషల్ మీడియాలో స్టూడెంట్ పెట్టిన సూసైడ్ పోస్ట్ నోయిడా పోలీసులును పరుగెత్తించింది. బాలుడిని కాపాడేందుకు మొత్తం నోయిడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా సెల్ ఇన్స్టాగ్రామ్లో 10వ తరగతి విద్యార్థి పోస్ట్ "ఆత్మహత్య వీడియో"ని చూశారు. బాలుడిని రక్షించేందుకు, బాలుడు ఉన్న లొకేషన్ ట్రేస్ చేసేందుకు పోలీసులు ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుండి సహాయం తీసుకున్నారు. ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని సెంట్రల్…
Voyager-2: 1977లో భూమి నుంచి ప్రయోగించి వాయేజర్ -2 అంతరిక్ష నౌక ఇప్పటికీ విశ్వ రహస్యాలను భూమికి పంపిస్తూనే ఉంది. మన సౌర వ్యవస్థను దాటేసి సూర్యుడి ప్రభావం అస్సలు లేని ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తోంది. 1977లో విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు వాయేజర్ 1, వాయేజర్-2 అంతరిక్ష నౌకల్ని నాసా ప్రయోగించింది. భూమికి సుదూరంగా ఉన్న గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల అధ్భుత ఛాయాచిత్రాలను భూమికి పంపించాయి. తాజాగా వాయేజర్ 2 మిషన్ 2026 వరకు పనిచేసేందుకు సిద్ధంగా…
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీస్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్, అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
Supreme Court On Atiq Ahmad killing: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నల్ని సంధించింది. అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లను ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్న సందర్భంలో దుండగులు హత్య చేశారు. ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు కోరతూ న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసి పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది.
Amit Shah: కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలబురిగి సభలో ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ప్రచారాన్ని రసవత్తంగా మార్చాయి. మోడీ ‘విష సర్పం’ అంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది.
Joe Biden: అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం డెమెక్రాట్ల తరుపున మరోసారి జో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ల తరుపును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జో బైడెన్ మరోసారి విపక్షాలకు టార్గెట్ అయ్యారు. గతంలో కొన్ని సందర్భాల్లో జో బైడెన్ తడబడటం, మనుషుల్ని పోల్చుకోకపోవడం వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచారు.
Man kills wife: హర్యానాలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్యను తలపించే విధంగా ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సొంత భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మనేసర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే 34 ఏళ్ల వ్యక్తి తన మొదటి భార్య చేతులు నరికి, ఆపై శరీరం నుంచి తలను వేరు చేసి మృతదేహానికి నిప్పటించాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.