JioCinema: జియో సినిమా బిగ్ డీల్.. ఇకపై హెచ్‌బీఓ , వార్నర్ బ్రదర్స్ కంటెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioCinema: జియో సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంగా మార్చేందుకు రిలయన్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ గా ఉన్న జియో సినిమా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో పెయిడ్ సబ్‌స్ట్రిప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ మ్యాచులు మే 28తో ముగిసిన వెంటనే జియో సినిమా ఇకపై ఫ్రీగా వీక్షించే అవకాశం ఉండదని చెప్పకనే చెప్పింది. కొత్త కంటెంట్ ను యాడ్ చేయడంతో పాటు యూజర్లను ఆకర్షించేలా ప్లాన్స్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయింది.
Read Also: The Kerala Story: ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలో మరో సినిమా! వివాదాల నీలినీడలు!!
Also Read
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
ఇదిలా ఉంటే ప్రస్తుతం జియో సినిమా భారీ డీల్ కుదుర్చుకుంది. హాలీవుడ్ కంటెంట్ అందించే వార్నర్ బ్రదర్స్, హెచ్‌బీఓ, డిస్కవరీతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ వెంచర్, వయాకామ్ 18, దాని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోసినిమాలో హాలీవుడ్ కంటెంట్ తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసమే ఈ భారీ ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వార్నర్ బ్రదర్స్ అలాగే దాని హెచ్‌బీఓ కంటెంట్ జియో సినిమా యాప్ లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలు పూర్తిగా తెరపైకి రాలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ రింగ్స్, హ్యరీపోటర్ సీరిస్ వంటి హెచ్‌బీఓ కంటెంట్ ఇకపై జియో సినిమాలో అందుబాటులోకి వస్తుంది.
మార్చి 31న డిస్నీ హాట్‌స్టార్ నుంచి హెచ్‌బీఓ తమ కంటెంట్ ను తొలగించుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు కూడా హెచ్‌బీఓ తమ కంటెంట్ ను ఇక మీదట ఇవ్వదని తెలుస్తోంది. భారతదేశంలో హెచ్‌బీఓకు కేరాఫ్ గా జియో సినిమా పనిచేయనుంది. హెచ్‌బీఓ సిరీస్, మ్యాక్స్ సిరీస్, వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ సీరీస్‌లు యూఎస్ తో పాటు ఇండియాలో కూడా ఒకే రోజు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ ఓటీటీ మార్కెట్ లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటివే అగ్రస్థానంలో ఉన్నాయి. జియో సినిమా త్వరలోనే కీలక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గా ఎదగాలని అనుకుంటోంది.
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?