Nursing Colleges: ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలతో కలిపి రూ. 1,570 కోట్లతో 157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో తక్కువ ధరకు నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించడంతో పాటు నర్సింగ్ నిపుణుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: Pakistan: భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని వణుకుతున్న పాకిస్తాన్..
ఈ నర్సింగ్ కాలేజీలకు వైద్య కళాశాలలతో కలిపి ఉంచడం వల్ల ప్రస్తుతం ఉన్న మౌళిక సదుపాయాలు, స్కిల్ ల్యాబ్ లు, క్లినికల్ సౌకర్యాలతో పాటు లెక్చలర్ల ను సరైన విధంగా వినియోగించే అవకాశం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. ప్రణాళిక, అమలకు సంబంధించి రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో పాటు మెడికల్ డివైసెస్ రంగానికి సంబంధించిన పాలసీని కూడా క్యాబినెట్ ఆమోదించింది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో వైద్యపరికరాల రంగం ప్రస్తుతం ఉన్న 11 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెంచడానికి సహాయపడుతుందని కేంద్రం భావిస్తోంది.