100th Episode Of PM Modi's 'Mann Ki Baat': ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం మరో ఘనతను సాధించింది. ఏప్రిల్ 30న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘‘ ప్రధాన మంత్రి ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న యూఎన్ హెడ్ క్వార్టర్స్ లోని ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నందున ఒక…
Mukhtar Ansari: ఉత్తర్ ప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్, పొటిలికల్ లీర్స్ అయిన ముఖ్తార్ అన్సారీ, అతని సోదరుడు అఫ్జల్ అన్సారీలను కిడ్నాప్, హత్య కేసులో దోషులుగా నిర్థారించిన ఎమ్మెల్యే-ఎంపీ కోర్టు ఈ రోజు శిక్ష విధించింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యకు సంబంధించి కిడ్నాప్, హత్య కేసులో వీరిద్దని కోర్టు దోషులుగా నిర్థారించింది. ముఖ్తార్ అన్సారీకి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.
Pakistan: పాకిస్తాన్ లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ ఆర్థిక సంక్షోభం ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తోంది. ఇక రాజకీయంగా అస్థిరత నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వార్త ఒళ్లుగగుర్పాటుకు గురిచేస్తోంది. పాకిస్తాన్ లోని తల్లిదండ్రులు తమ కూతుళ్ల సమాధులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. చనిపోయిన కూతుళ్ల శవాలపై అత్యాచారాలకు ఒడిగట్టకుండా తల్లిదండ్రులు సమాధులకు తాళాలు వేస్తున్నారని డైలీ టైమ్స్ వెల్లడించింది. దేశంలో ‘‘నెక్రోఫిలియా’’ కేసులు పెరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
Anji Khad bridge: భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ ఆధారితంగా నిర్మించిన రైలు వంతెన సిద్ధం అయింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంజి ఖాడ్ వంతెనగా పిలువబడే ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ బ్రిడ్జ్ వినియోగానికి సిద్ధం అయిందని, దీంట్లో మొత్తం 96 కేబుల్స్ ఉన్నాయని, కేబుల్స్ లో ఉండే మొత్తం వైర్ల పొడవు 653 కిలోమీటర్లు అని, 11 నెలల్లో ఈ వంతెనను నిర్మించినట్లు ఆయన…
Rekha Singh: 2020 లడఖ్ గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ప్రతిగా భారత్ బలగాలు జరిపిన దాడిలో దీనికి రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు హతమయ్యారు. అయితే తమ వారు మాత్రం నలుగురే చనిపోయారంటూ చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. గాల్వాన్ ఘర్షణల్లో భారత సైనికుల వీరత్వాన్ని చూసిన చైనా బలగాలు మరోసారి భారత్ పై దాడి చేసేందుకు వణికిపోతున్నాయి.
Azam Khan: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ లో సివిల్ పోల్స్ ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తనకు భయమేస్తోందని, తనను కూడా అతిక్ అహ్మద్ లాగే కాల్చి చంపుతారని భయపడుతున్నానని అన్నారు. నా నుంచి, మా పిల్లల నుంచి మీకు ఏం కావాలి..?
Bus Overturns in Chhattisgarh:ఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మోహ్లా మన్పూర్లో బస్సు బోల్తా పడింది. చిన్నారులతో సహా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. దోండి లోహరా ప్రాంతం నుంచి కురేత గ్రామానికి బయలుదేరిన బస్సు శుక్రవారం బోల్తా పడటంతో ప్రయాణికులు గాయపడ్డారు.
Amit Shah: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. బీజేపీ తరుపున శుక్రవారం పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నుంచి కర్ణాటకను కాపాడుతుందని ఆయన అన్నారు. శిరహట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఓటు సరైన నాయకత్వానికి వెళ్లేలా చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
Tiger spotted in Haryana after 110 years: దాదాపుగా 110 ఏళ్ల తర్వాత హర్యానాలో పులి కనిపించింది. చివరి సారిగా 1913లో పులి కనిపించినట్లు రాష్ట్ర అటవీ, వన్యప్రాణి మంత్రి కన్వర్ పాల్ చెప్పారు. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కలేసర్ నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులికి సంబంధించిన ఫోటోలు చిక్కాయని అధికారులు వెల్లడించారు. 110 సంవత్సరాల తర్వాత కలేసర్ ప్రాంతంలో పులి కనిపించడం రాష్ట్రానికి గర్వకారణం మంత్రి అన్నారు. అడవులు మరియు వన్యప్రాణులు మన సహజ వారసత్వం మరియు…
Oral sex causes throat cancer: ఓరల్ సెక్స్ పద్ధతులు గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అమెరికా, యూకే దేశాల్లో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ రెండు దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) ఎక్కువగా వస్తుంటాయి.