Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది.
Ukraine 'Maa Kali' tweet: ఉక్రెయిన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘‘కాళీ మాత’’ అగౌరపరిచేలా వివాదాస్పద ట్వీట్ చేసింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది. రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత ఓ వెలువడిన పోగపై కాళీ మాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’అనే క్యాప్షన్ తో స్కర్టు ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్…
Rogue elephant Arikomban captured: కేరళలోని ఇడుక్కి జిల్లా ప్రజలను నానాకష్టాలు పెడుతున్న ఏనుగు ‘అరికొంబన్’ ఎట్టకేలకు చిక్కింది. అధికారులు ఎనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది. ఏనుగును పెరియార్ టైగర్ రిజర్వ్ కు తరలించారు. నిన్న తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం అయిన మిషన్ ఏనుగును గుర్తించలేకపోయింది. అయితే ఆదివారం మళ్లీ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు ఏనుగును గుర్తించారు.
Zelensky: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది.
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం కోణంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సీపీఎం పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమాను నిర్మించారని దుయ్యబడుతున్నారు.
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బాదుడు షుచూ చేసింది. వినియోగదారుల నుంచి ఫుడ్ ఆర్డర్ పై రుసుము వసూలు చేస్తోంది. ఫుడ్ ఐటమ్స్ తో సంబంధం లేకుండా ‘‘ప్లాట్‌ఫారమ్’’ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి రూ. 2 చొప్పున వసూలు చేయడం ప్రారంభించింది. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలు పెరగడం అనేది ఉండదు.
Jairam Ramesh: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని నరేంద్రమోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ కాంగ్రెస్ మాత్రం స్థానికతకు పెద్ద పీట వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. నాలుగు ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కర్ణాటక ప్రజలకు విటమిన్-పి కావాలని ఆయన అన్నారు.
Lightning Strike: ఉరుములు, పిడుగులు పడుతున్న వేళ ఎలక్ట్రానిక డివైజ్ వాడకూడదని చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ సూచనలను పట్టించుకోరు. తాజాగా ఇలాగే పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో 50 ఏళ్ల రైతు తన పొలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపాటుకు గురై మరణించాడు.
PM Modi: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శక్తివంచన లేకుండా అధికారం కోసం ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలను ప్రారంభించారు. ఆదివారం కోలార్ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. కోలార్ లో జరిగిన సభ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తుందని అన్నారు. ఈ రెండు పార్టీలు కర్ణాటక అభివృద్ధికి అవరోధంగా తయారయ్యాయన్నారు. ప్రజలు వాటిని క్లీన్ బౌల్డ్ చేశారని, కాంగ్రెస్, జేడీఎస్ అవినీతి ప్రభుత్వం నుంచి బీజేపీ కర్ణాటక ప్రజలను…
India becomes Europe's largest supplier of refined fuels: యూరప్ దేశాలకు అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా భారత్ నిలిచింది. భారత్ నుంచి గణనీయంగా శుద్ధి చేసిన ఇంధనం యూరప్ కు ఎగుమతి అవుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయికి ఇంధన ఎగుమతులు చేరాయి. అనలిటిక్స్ సంస్థ Kpler వెల్లడించిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి యూరప్ కు ఇంధన ఎగుమతులు పెరిగాయి. రోజుకు 3,60,000 బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురును భారత్ నుంచి…