Mann Ki Baat: ప్రధాని మోడీ “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్.. ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్‌లో లైవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
100th Episode Of PM Modi’s ‘Mann Ki Baat’: ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం మరో ఘనతను సాధించింది. ఏప్రిల్ 30న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రధాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘‘ ప్రధాన మంత్రి ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న యూఎన్ హెడ్ క్వార్టర్స్ లోని ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నందున ఒక చారిత్రాత్మక క్షణానికి సిద్ధంగా ఉండండి’’ అంటూ ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ట్వీట్ చేసింది.
Read Also: Maoist letter : వరంగల్ లో మావోయిస్టుల లేఖ కలకలం
Also Read
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
ప్రతీ నెల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ పేరుతో రేడియో ప్రసంగం ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఏప్రిల్ 30న దీనికి సంబంధించిన 100 వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. అమెరికా కాలమాన ప్రకారం అక్కడ ఉదయం 1.30 గంటలకు న్యూయార్క్ లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మిలియన్ల మంది పాల్గొనేందుకు మన్ కీ బాత్ స్పూర్తినిస్తుందని భారత మిషన్ పేర్కొంది.
న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, కమ్యూనిటీ సంస్థలతో పాటు, న్యూజెర్సీలోని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యుల కోసం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ప్రసారం జరుగుతోంది. 2014 అక్టోబర్ 3న ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ నెట్వర్క్ ద్వారా తొలిసారిగా ప్రసారం చేయబడింది. 30 నిమిషాల నిడివిగల ఈ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది.
Get ready for a historic moment 🎉 as the 100th episode of PM Modi's "Mann Ki Baat"🎙️ is set to go live on April 30th in Trusteeship Council Chamber at @UN HQ!
📻 #MannKiBaat has become a monthly national tradition, inspiring millions to participate in 🇮🇳’s developmental journey pic.twitter.com/6ji4t1flmu
— India at UN, NY (@IndiaUNNewYork) April 28, 2023
తాజావార్తలు
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
-
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
-
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!