Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసారం అయింది. దేశంతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యలయంలో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది. మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని అన్నారు. తన ఆలోచనలను పంచుకోగలిగానని వెల్లడించారు. 100వ ఎపిసోడ్ కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని దేశంలోని కోట్ల మంది వినేలా బీజేపీ భారీ ఏర్పాట్లను చేసింది.
China: చైనాలో ముస్లింలపై అణిచివేత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో నివసించే ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇస్లాంను ఆచరించకుండా అక్కడి ప్రజలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా చైనా అధికార యంత్రాంగా వీగర్ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదు రేడియో ఫ్రీ ఏషియా తన కథనంలో పేర్కొంది.
Delhi: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సందర్భాల్లో తెలిసిన వారి నుంచి బాలికలు, మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కు తేడా తెలియకపోవడంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చాలా సందర్భాల్లో పరువు కారణంగా కొన్ని కేసులు బయటకు రావడం లేదు. మరోవైపు అత్యాచారాలు, లైంగిక నేరాలకు ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకుని వచ్చినా.. అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా ఢిల్లీలో బాధ్యతాయుతం అయిన ఉపాధ్యాయ…
Man Kills Minor Wife: త్రిపుర రాష్ట్రంలో ఘోరం జరిగింది. అగర్తాలలో 15 ఏళ్ల మైనర్ అయిన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు. బాధితురాలు తనూజాబేగం శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. గంటల తరబడి వెతికిన తర్వాత రెండు సంచుల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఓ సంచితో తల, మరోసంచితో మిగతా శరీరం భాగం లభ్యం అయింది.
Texas Gun shooting: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ అఘాంతకుడు 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురిని అత్యంత క్రూరంగా కాల్చిచంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత, సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Chennai: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కౌలాలంపూర్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలి వద్ద ఏకంగా 22 పాములను గుర్తించారు. లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో విషపూరితమైన పాములను అధికారులు గుర్తించారు. వీటిలో రకరకాల పాములు ఉన్నాయి. 10 అడుగులకు పొడవైన పాములను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.
Drug-Resistant Bacteria: ఇన్నాళ్లు గాలి ద్వారా, నీటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుందని విన్నాం. చివరకు ఇతర జీవులు, పక్షుల ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందాయి. అయితే ప్రస్తుతం ఓ విషయం అందర్ని కలవరానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లు మేఘాలు కేవలం వర్షాలను కురిపిస్తాయని అంతా అనుకున్నారు, కానీ ప్రస్తుతం ప్రాణాంతక బ్యాక్టీరియాను కూడా మోసుకొస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. డ్రగ్స్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను సుదూర ప్రాంతాల నుంచి ఈ మేఘాలు మోసుకోస్తున్నట్లు తేలింది.
S Jaishankar: భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని చైనా రక్షణ మంత్రి ఒకరోజు ముందు కీలక కామెంట్స్ చేశారు. దీని తర్వాతి రోజే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా తీరుపై ధ్వజమెత్తారు. సరిహద్దు ఒప్పందాలు ఉల్లంఘించిన కారణంగా చైనాతో భారత్ సంబంధాలు సరిగా లేవని ఆయన అన్నారు. పాకిస్తాన్, చైనా మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటోందని అన్నారు. కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ…
Shivraj Singh Chouhan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని మోడీని ‘విషసర్పం’తో పోల్చడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖర్గేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని శివుడి(నీలకంఠుడు)తో పోల్చారు. ప్రధాని దేశ ప్రజల కోసం విషాన్ని భరిస్తున్నారని అన్నారు. ప్రధాని సుసంపన్నమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.
Ram Navami violence: రామ నవమి రోజు బీహార్ ససారంలో ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ హింసలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మాజీ బీజేపీ ఎమ్మెల్యే జవహర్ ప్రసాద్ ను రోహ్తాస్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామం బీహార్ రాష్ట్రంలో జేడీయూ వర్సెస్ బీజేపీగా మారింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జవహర్ ప్రసాద్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని బీజేపీ ఆరోపించింది.