Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. బుధవారం ఉక్రెయిన్ లోని దక్షిణ ఖేర్సన్ ప్రాంతంపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 21 మంది మరణించడంతో పాటు 48 మంది గాయపడ్డారు. శుక్రవారం నుండి ప్రధాన నగరమైన ఖెర్సన్లో అధికారులు కర్ఫ్యూ విధించారు.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అంతమొందించడానికి మాస్కోలోని అధ్యక్ష భవనంపై డ్రోన్ అటాక్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఈ ఘటనకు ఉక్రెయిన్ కారణం అని, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ పథకం ప్రకారమే పుతిన్ ను అంతమొందించడానికి ప్రయత్నించాడని రష్యా పార్లమెంట్ ఆరోపించింది. తమకు ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని రష్యా తీవ్ర స్వరంతో హెచ్చరించింది.
Pakistan: కాశ్మీర్ అంశాన్ని ఎజెండాగా చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. మే 4-5 తేదీల్లో గోవాలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సభ్యదేశాలు విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి పాకిస్తాన్ తరుపున ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకాబోతున్నారు. 2014 తర్వాత ఓ పాకిస్తాన్ నాయకుడు భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యాతో పాటు కజకిస్తాన్, కర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు.
Same Gender Marriage: సెమ్ సెక్స్ మ్యారేజ్ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వాడీవేడీ వాదనలు జరుగున్నాయి. స్వలింగ వివాహాల విషయంలో ఆ జంటలు తమ హక్కులను కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే LGBTQIA+ కమ్యూనిటీ ఆందోళనల్ని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది.
Crocodiles attack: ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. కాలక్షేపం కోసం చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసళ్లు దాడి చేశాయి. మొసళ్లు చంపి తిన్నాయి. ఈ ఘటన ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో జరిగింది. 65 ఏళ్ల బాధితుడిని కేవిన్ దర్మోడీ అని గుర్తించారు. శనివారం చేపలు పట్టేందుకు వెళ్లిన అతను మొసళ్ల దాడిలో చిక్కుకున్నాడు.
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళలో జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు ఇతివృత్తంగా సినిమాను రూపొందించినట్లు మూవీ మేకర్స్ వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఏకంగా.. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు.
Wrestler Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెజ్లర్ల నిరసనకు అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడం చాలా కష్టమని ఆమె బ్రిజ్ భూషన్ ను ఉద్దేశించి…
The Kerala Story: ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని ఆపాలంటూ పలువురు సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు పలు ముస్లిం సంఘాలు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలా వ్యతిరేకతకు కారణం ఏమిటని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.
12-year-old boy mauled to death by stray dogs: అభం శుభం తెలియని చిన్నారుల పాలిట మృత్యవుగా మారుతున్నాయి కుక్కలు. పిల్లలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు వీరికి ఈజీ టార్గెట్ అవుతున్నారు. దేశంలో రోజుల వ్యవధిలో ఎక్కడో చోట కుక్కల దాడులు వెలుగులోకి వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది అసలు వీటి గురించి పట్టించుకోవడమే లేదు. ఇదిలా ఉంటే వీధికుక్కల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలుడిని చంపేశాయి.