The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళలో జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు ఇతివృత్తంగా సినిమాను రూపొందించినట్లు మూవీ మేకర్స్ వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఏకంగా.. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు.
Read Also: The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమా వివాదం ఏంటి?.. ఎందుకీ వ్యతిరేకత..?
ఇదిలా ఉంటే శుక్రవారం ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న సందర్భంగా తమిళనాడు స్టేట్ లో హై అలర్ట్ నెలకొంది. తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సినిమా విడుదలపై స్టాలిన్ సర్కార్ కు హెచ్చరికలు చేసింది. ఇప్పటికే కేరళలో ఈ సినిమాపై ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. తమిళనాడులో కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది.
కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మహిళలు ఇస్లాంలోకి మార్చబడ్డారని, ఇందులో కొంతమంది ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితం అయ్యారని, ఐసిస్ పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కొందరు ఐసిస్ పోరాటానికి మద్దతుగా సిరియా వెళ్లిన ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సినిమాను తప్పుపట్టారు. 32 వేల మంది మతం మారినట్లు రుజువు చేస్తే రూ.1 కోటి ఇస్తామని ముస్లిం సంస్థ ఛాలెంజ్ చేసింది.