12-year-old boy mauled to death by stray dogs: అభం శుభం తెలియని చిన్నారుల పాలిట మృత్యవుగా మారుతున్నాయి కుక్కలు. పిల్లలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు వీరికి ఈజీ టార్గెట్ అవుతున్నారు. దేశంలో రోజుల వ్యవధిలో ఎక్కడో చోట కుక్కల దాడులు వెలుగులోకి వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది అసలు వీటి గురించి పట్టించుకోవడమే లేదు. ఇదిలా ఉంటే వీధికుక్కల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలుడిని చంపేశాయి.
ఉత్తర్ ప్రదేశ్ బరేలీలోని సిబీగంజ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడి వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ దాడిలో మరో చిన్నారికి గాయాలయ్యాయి. ఖాన గౌన్తియా గ్రామంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కల గుంపు పిల్లాడిపై దాడి చేశాయి. ప్రాణాల కోసం పిల్లాడు భయపడి పరిగెత్తినా కుక్కలు విడిచిపెట్టలేదు. కిందపడేసి దాడి చేసి తీవ్రం గాయపరిచాయి. బాలుడి పరిస్థితిని చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
Read Also: West Bengal: బీజేపీ నాయకుడి మృతి.. తృణమూల్ హత్య చేసిందని ఆరోపణలు
బరేలీలో పిల్లలపై వీధికుక్కలు దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేయడంతో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తన ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు ఆమెను 150 మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేశాయి. వీధికుక్కల బెదడపై బరేలీ ప్రజలు జిల్లా యంత్రాంగానికి, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఓ 7 ఏళ్ల బాలికపై ఇలాగే వీధికుక్కలు దాడి చేశాయని పోలీసులు తెలిపారు. నైరుతి ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో తన ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను వీధికుక్కలు కరిచాయి. ఏప్రిల్ 27న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో గత నెలలో 14 ఏళ్ల బాలుడినిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.