Star Swallowing A Planet: విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. ఇందుకు గ్రహాలు, నక్షత్రాలు మినహాయింపేం కాదు. ఏదో రోజు సూర్యుడు కూడా అంతం కావాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు ఓ నక్షత్రం, దాని చుట్టూ తిరుగున్న గ్రహాన్ని కబళించడాన్ని గుర్తించారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), హార్వర్డ్ యూనివర్సిటీ మరియు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం గ్రహాన్ని, మాతృ నక్ష్రతం ఎలా చంపేస్తుందనే దాన్ని గమినించారు. సూర్యుడి పరిమాణంలో ఉండే నక్షత్రం, గురుడు…
NCP crisis: దేశరాజకీయాల్లో కీలక నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ) అధినేతగా ఉన్న శరద్ పవార్ ఆ పదవికి రాజీనామా చేశారు. అకాస్మత్తుగా ఆయన నిర్ణయం దేశాన్ని ఆశ్చర్యపరిచింది.
Wrestlers protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
India at UN: భారతదేశం మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) నిర్మాణంపై నిలదీసింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి, రుచిరా కాంబోజ్ భద్రతా మండలి యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. ఐదు దేశాలు ఇతర దేశాలను ఇతరుల కన్నా ఎక్కువ చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి అందర్ని కలుపుకుపోవడం లేదని చెప్పింది. యూఎన్ లో ప్రపంచ శాంతి కోసం జరిగిన బహిరంగ చర్చ సందర్భంగా కాంబోజ్ మాట్లాడారు.
Cognizant: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ జాబితాలో మరో టెక్ సంస్థ కాగ్నిజెంట్ కూడా చేరింది. 2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. కాగ్నిజెంట్‌కు ప్రధాన ఆదాయం యూఎస్ నుంచి వస్తోంది.
Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో భారత్ మరింత దిగువ స్థానానికి పడిపోయింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2023లో భారత్ 161 స్థానానికి పరిమితం అయింది. గతేడాది 150 స్థానంలో ఉన్న భారత్.. 11 స్థానాలు దిగజారింది. రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) అనే గ్లోబల్ మీడియా వాచ్డాగ్ ప్రతీ ఏడాది వివిధ దేశాల్లోని మీడియా స్వేచ్ఛపై ప్రెస్ ప్రీడం డే రోజున ఈ ర్యాంకులను ప్రచురిస్తుంటుంది.
Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మైనారిటీల దాడులు జరుగుతన్నాయంటే అక్కడ పట్టించుకునే ప్రభుత్వమే లేదు. తాజాగా తనను నిరాకరించందనే కోపంతో హిందూ బాలికను అత్యంతదారుణంగా హత్య చేశాడో ముస్లిం వ్యక్తి. బంగ్లాదేశ్ లోని తూర్పు జిల్లా నేత్రకోనాలోని బర్హట్టా సబ్ డిస్ట్రిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ముక్తి బర్మన్ (16) అనే హిందూ బాలికను కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు.
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు కీలక విజయం లభించింది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు పోలీసులు వెల్లడించారు. కొద్ది రోజుల్లో ఉగ్రవాదులు భారీగా దాడులకు సిద్ధం అవుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా గురువారం ఉదయం బారాముల్లా జిల్లాలోని క్రీరి ప్రాంతంలో వనిగం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ముం
Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధామ్తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బొలెరో ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది అక్కడిక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది.
SCO Meeting: షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. మే 4-5 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను పరిశీలించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం గోవాలకు చేరుకున్నారు. ఎస్సీఓ సభ్యదేశాల్లో ఒకటైన పాకిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.