నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా, నటి కరాటే కల్యాణి మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. శివాజీ పాలిష్‌డ్‌గా చెప్పలేకపోయి ఉండొచ్చు కానీ, ఆయన చెప్పిన పాయింట్‌లో నిజం ఉందన్నారు.
Also Read : Manchu Lakshmi: సీఐడీ ఆఫీస్‌లో మంచు లక్ష్మి.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ!
ముఖ్యంగా నటి అనసూయ, సింగర్ చిన్మయిల స్పందనపై కల్యాణి ఘాటుగా స్పందించారు. “నా శరీరం నా ఇష్టం” అనడం సరికాదని, పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. “అనసూయ గారు.. మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, రేపు వారు అసభ్యంగా దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే మీకు ఇష్టమేనా?” అంటూ సూటిగా ప్రశ్నించారు. కేవలం పాపులారిటీ కోసమే కొందరు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని, సోషల్ మీడియా పోర్న్ సైట్‌లుగా మారుతున్నా వీరు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె కడిగిపడేశారు. అంతే కాదు.. ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే 10 ఏళ్లలో కల్చర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్రతీ తండ్రి కన్యాదానం చేసేటప్పుడు నా కూతుర్ని కన్యగానే దానం చేస్తున్నానా? అనే అనుమానం కలుగుతుంది అని కల్యాణి ఆందోళన వ్యక్తం చేశారు.