West Bengal: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నాయకుడి మరణం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ మధ్య మంటలు రేకెత్తించింది. తమ పార్టీ నాయకుడిని తృణమూల్ కాంగ్రెస్ హత్య చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని టీఎంసీ తోసిపుచ్చింది. మొయినా బిజెపి బూత్ ప్రెసిడెంట్ బిజయ్కృష్ణ భునియా సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా అతని భార్య ముందే టీఎంసీ గుండాలు కొట్టారని, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారని బీజేపీ ఆరోపించింది.
Sharad Pawar: ఎన్సీపీ నాయకుడు, సీనియర్ నేత శరద్ పవార్ తన ఆత్మకథలో సంచలన విషయాలను వెల్లడించారు. తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మాజే సంగతి’(ప్రజలు నాకు తోడుగా ఉన్నారు) పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ కేంద్రబిందువు అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని శరద్ పవార్ వెల్లడించారు. ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా జాతీయ పార్టీగా తన స్థాయిని గుర్తు తెచ్చుకుంటుదని ఆయన అన్నారు.
Israel: ఇజ్రాయిల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. గాజాలోని హమాస్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఇజ్రాయిల్ భూభాగంపైకి గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. గాజా స్ట్రిప్ లోని అనేక భాగాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. హమాస్ శిక్షణా కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. దక్షిణ ఇజ్రాయెల్ పైకి 35 రాకెట్లను గాజా నుంచి ప్రయోగించారు.
Imran Khan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. రాజకీయంగా కూడా పతనావస్థలో ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, అక్కడి షహజాబ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరోవైపు సైన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు తీవ్ర ఒత్తడిలో ఉన్నాయి. దీనికి తోడు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరగడం పాకిస్తాన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుపుతోంది.
USCIRF report: భారతదేశం అంటే పక్షపాతంగా వ్యవహరించే అమెరికాలోని కొన్ని సంస్థలు మరోసారి అలాంటి ప్రయత్నాన్నే చేశాయి. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని, మైనారిటీలు హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు భారత్ లోకి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులపై ఆంక్షలు విధించాలని బైడెన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో 2022లోనూ భారత్ లో మతస్వేచ్ఛ పతనమవడం 2022లోనూ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో మతవివక్షను పెంచేలా చర్యలు…
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తన ఫేస్ బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ ప్రోగాం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఏకం కావాలని అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి అందరూ కలిసి బీజేపీని ఓడించగలరని ఆమె అన్నారు.
Honda Elevate mid-size SUV: జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ మిడ్ సైజ్ SUVని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబోతోంది. దేశీయంగా కార్ మార్కెట్ పుంజుకోవడంతో పాటు ఇండియాలో మిడ్ సైజ్ SUV కార్లకు డిమాండ్ ఏర్పడటంతో దేశ, విదేశీ కార్ల తయారీ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ మోడల్ ను హెండా ఎలివేట్ అని పిలుస్తారని తెలుస్తోంది. 2023 పండగ సీజన్ ప్రారంభానికి ముందు భారత్ తో ఈ…
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తూర్పున ఉన్న నాలుగు కీలక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్నోబిల్ అణు కర్మాగారం వద్ద కందకాలు తవ్విన రష్యా సైనికులు రేడియషన్ బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Go First: దేశంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన గోఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సంస్థ ఈ రోజు జాతీయ లా ట్రిబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. 27 దేశీయ గమ్యస్థానాలతో పాటు 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవల్ని అందిస్తోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్ లైనర్ గా ఉంది.
Cyclonic Circulation: భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మే 6 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ మంగళవారం తెలిపింది. యూఎస్ వెదర్ ఫోర్కాస్ట్ మోడల్ గ్లోబర్ ఫోర్కాస్ట్ సిస్టమ్(GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రెంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ECMWF) బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని తర్వాత ఐఎండీ కూడా తాజా నివేదికలో వాయుగుండం ఏర్పడుతుందని వెల్లడించింది.