Pakistan: కాశ్మీర్ అంశాన్ని ఎజెండాగా చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. మే 4-5 తేదీల్లో గోవాలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సభ్యదేశాలు విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి పాకిస్తాన్ తరుపున ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరుకాబోతున్నారు. 2014 తర్వాత ఓ పాకిస్తాన్ నాయకుడు భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యాతో పాటు కజకిస్తాన్, కర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు.
Read Also: Chiyaan Vikram : రిహార్సల్స్ లో హీరో విక్రమ్ కు ప్రమాదం.. విరిగిన పక్కటెముక
అయితే ఈ సమావేశంలో కాశ్మీర్ ను ప్రధాన ఎజెండాగా లేవనెత్తేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎజెండాతో సంబంధం లేకుండా ఏ సమావేశం అయిన జమ్మూ కాశ్మీర్ అంశాన్నే లేవనెత్తుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పలుమార్లు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే భారత్ కూడా చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని చెప్పింది.
ఎస్ సీఓ సమావేశాల నేపథ్యంలో బిలావల్ భుట్టోతో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశం కాబోరని తెలుస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాలతో సమావేశాలు పెట్టుకోమని జైశంకర్ స్పష్టత ఇచ్చారు. దీంతో పాటు ఇటీవల పూంచ్ ఉగ్రదాడిలో కూడా పాక్ టెర్రరిస్టుల ప్రమేయం ఉండటంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక భేటీ ఉండదని తెలుస్తోంది.